Total Pageviews

Thursday, August 25, 2011

ఆహారము , Food

హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )

ఆహారము , Food

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని వృత్తిగా స్వీకరించారు.


ఆహారం ఆధారాలు

ఆహారం కోసం మొక్కల మీద ఆధార పడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి పాడి చేయడం ద్వారాను లభిస్తుంటాయి.

మొక్కలనుండి లభించే ఆహారం

2000
జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహరం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది.

పిండిపదార్ధాలను అందించే బియ్యము, గోదుమలు, ఇతర చిరు దాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు , మినపప్పు, చెనగబేడలు, పెసలు, అలసందలు మొదలైన పప్పుదాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.

పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది.

తోటకూర, ఉల్లి, అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గాంగూర, తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసు కుంటాము.వంకాయ,బెండకాయ,ఆకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము.వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ,చామగడ్డ,కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్,కుకుమపువ్వు,అవిసిపువ్వు,మునగపువ్వు,అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి.
జంతువుల నుండి లభించే ఆహారం

క్షీరదాలనుండి పాలను సేకరించి,పాలనుండి అనేక ఇతర ఆహారపదార్ధాలను తయారుచేసి ఆహారలో ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగు,జున్ను,చీజ్,పనీర్,యోగర్ట్,వెన్న,నెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తాయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.జలచరాలను,పక్షులను, పక్షిగుడ్లను,జంతువుల మాంసం,కొన్ని చోట్ల ,జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.కొన్నితూర్పుఆసియా ఖండంలోని దేశాలైన జపాన్,బర్మాలలో లో పాములను,చైనాలో ఎలుకలు ఆహాంగా తీసుకుంటారు.ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం భారతదేశలో అలవాటే.
సంప్రదాయంలో ఆహారం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం.దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.ఇవి ఆహారానికి ఉన్న ప్రాదాన్యాన్ని సూచిస్తున్నాయి.పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాదాన్యత ఉంది.సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి.అథిధి అభ్యాగతులకు భోజనసదుపాయం చేయడం సంప్రదాయమే.పరిచయస్తులకు కాఫీ,టీ లనైనా అందిచడం సంప్రదాయమే.జబ్బున పడిన వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడూ,పసిపిల్లను చూడటనికి వెళ్ళేటప్పుడూ,బధి మిత్రులను చూడటానికి వేళ్ళే సమయాలలో పడ్లు మొదలైన ఆహారాన్ని తీసుకు వెళతారు.సత్రాలు కట్టి బాటసారులకు,దేవుని దర్శనానికి వచ్చే భక్తులకూ ఉచితబోజనాలను అందించడం సంప్రదాయమే.ఆహారాన్ని ప్రసాదంగా అందించడం కోవెల సాంప్రదాయాలలో ఒకటి.

పచనం చేసే విధానాలు

పచనం అంటే వండటం. కొన్ని ఆహారాలను అలాగే తీసుకున్నా చాలా వరకు ఆహారం బాక్టీరియా నూండి రక్షణ కోసం, సులభంగా జీర్ణం కావడం కోసం, రుచి కోసం వండటం ద్వారా ఆహారంగా మారుస్తారు. కడిగి, ముక్కలుచేసి, ఇతర ఆహార పదార్ధాలను చేర్చి వేడిచేయడం, చల్లబరచడం, వేగించడం, నీటితో చేర్చి వండటం, ప్రెషర్ కుక్కర్ మరియు ఇతర సాదనాలతో ఆవిరిలో వండటం, నూనెలో దేవటం, కాల్చటం మొదలైన పద్దతులలో ఆహారాన్ని పచనం చేస్తారు. ఇవి కాక నిలవ చేయటం ఉదాహరణగా ఊరగాయలు, వడీయాలు, వొరుగులు మొదలైన పద్దతులలో ఆహారాన్ని తయారు చేస్తారు. పండ్లు, కూరగాయలు నుండి తీసిన రసాలు ద్రవాహారాలలో ఒకటి. చట్నీలు,పచ్చళ్ళు నూరి వేడిచేయకుండానే ఆహారంగా చేస్తారు. తరిగిన పండ్లు, కూరగాయ ముక్కలతో ఇతర పదార్ధాలను చేర్చిన సలాడ్స్ ఆహారమే. పులవ పెట్టడంద్వారా ఇడ్లీ, దోశలు, పెరుగు మొదలైనవి ఆహారంలో భాగమే.
ఆహారం ఉత్పత్తి

ఆహారం తోటలు,పైరు మొదలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తారు.కబేళాలు,పాడి ప్రిశ్రమ ,చేపలు పట్టడం ,అడవిలో లభించే వస్తుసేకరణ ద్వారా అహారం లభిస్తుంది.వేట కూడా ఒక పద్దతే అయినా అది ఇప్పుడు నిషేదం.వ్యవసాయంలో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.
Posted by Dr.Vandan Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF