Total Pageviews

Sunday, September 18, 2011

ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపరేషన్


ఆర్పిఎఫ్కానిస్టేబుల్ఎదైనా ఎగ్జామ్పేపరు ఇంగ్లీషు లాంగ్వేజ్విభాగంలో 20 మార్కులకు 20 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్మల్టిపుల్ఛాయిస్టైప్లో ఉంటాయి. ఇంగ్లీషు విభాగంలో సాధారణంగా క్రింది అంశాలపై ప్రశ్నలుంటాయి.
1. Comprehension Test 2. Cloze Test 3.Synonyms Test4. Antonyms Test 5. Idioms and Phrases Test
6. Fill in the blanks Test7. Spelling Test8. Correction of Sentences Test, etc.,
ఆర్పిఎఫ్కానిస్టేబుల్పరీక్షలో ఇంగ్లీషు విభాగానికి శ్రద్ధగా ప్రిపేర్కావలసి ఉంటుంది. ఇంగ్లీషు పదజాలంలో మంచి పట్టు సంపాదించటానికి ప్రతిరోజు ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. రోజూ ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం సాధ్యపడని వారు ఉద్యోగ పత్రికలను చదవవచ్చు.
జనరల్అవేర్నెస్‌: జనరల్అవేర్నెస్విభాగానికి సిలబస్అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. కావున జనరల్అవేర్నెస్కి సంబంధించిన పరిధి విస్తృతంగా ఉంటుంది. జనరల్అవేర్నెస్ప్రిపరేషన్లో భాగంగా ప్రపంచానికి సంబంధించిన అంశాలు, భారతదేశానికి సంబంధించిన అంశాలు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు, జనరల్సైన్స్‌, క్రీడలు, అవార్డులు, గ్రంథాలురచయితలు, సర్వప్రధములు, కరెంట్అఫైర్స్ను విడివిడిగా చదవాలి.
ప్రపంచానికి సంబంధించిన అంశాలలో దేశాలురాజధానులు, దేశాలుకరెన్సీ, దేశాలు-పార్లమెంటు పేర్లు, దేశాలు-మారుపేర్లు, దేశాలుపాతపేర్లుకొత్త పేర్లు, వ్యక్తులుమారుపేర్లు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితిఅనుబంధ సంస్థలు. ప్రపంచ భూగోళం, ప్రపంచ చరిత్ర ముఖ్యమైనవి.
భారతదేశానికి సంబంధించిన అంశాలలో జాతీయ చిహ్నాలు, భారత భౌగోళిక పరిస్థితులు, భారతదేశ చరిత్రసంస్కృతి, భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థపంచవర్ష ప్రణాళికలు ముఖ్యమైనవి. వీటితో పాటుగా భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలు- రాజధానులు, నదులుప్రాజెక్టులు, పరిశోధనా సంస్థలు, జాతీయ ఉద్యానవనాలుపార్కులు, రాష్ట్రాలుకళారూపాలు. భారత రక్షణ వ్యవస్థక్షిపణులు, దర్శనీయ స్థలాలు, వివిధ కమిటీలుకమిషన్లు, ఖనిజాలు లభించు ప్రాంతాలు, ఎడారులు, భౌగోళిక మారుపేర్లు, వివిధ రాష్ట్రాల్లో గల తెగలు, జాతులు, జనాభా లెక్కలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారులు, నదీతీర నగరాలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్ర పతులు, ప్రధాన మంత్రులు, లోక్సభ స్పీకర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.
త్రివిధ దళాధిపతులు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన అంశాలలో ఆంధ్రప్రదేశ్‌ – జిల్లాలువైశాల్యంజనాభాఅక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్‌ – నదులు, ప్రాజెక్టులు, ఖనిజసంపద, రవాణా సౌకర్యాలు, రహదారులు పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలుపథకాలు వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
జనరల్సైన్స్లో శాస్త్రలుఅధ్యయన అంశాలు, శాస్త్ర పరికరాలు, శాస్త్ర ప్రమాణాలు, ఆవిష్కరణలు, విటమిన్లు, శరీర ధర్మశాస్త్రం, అంతరిక్ష పరిశోధనలు, కంప్యూటర్విజ్ఞానం, పర్యావరణ సంబంధ అంశాలు, క్రీడలకు సంబంధించి క్రీడాపదాలు, క్రీడలుకొలతలు, క్రీడలుఆడేవారి సంఖ్య, క్రీడా మైదానాలు, క్రీడలుకప్లుట్రోఫీలు, ఒలింపిక్క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్క్రీడలు, టెన్నిస్టోర్నమెంట్స్‌. ఫుట్బాల్టోర్నమెంట్స్‌, క్రికెట్విశేషాలను బాగా గుర్తుంచుకోవాలి.
అవార్డులకు సంబంధించి నోబెల్ప్రైజ్గ్రహీతలు, భారత రత్న, జ్ఞాన్పీఠ్‌, దాదాసాహెబ్ఫాల్కే, గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు, వాటిని ఇచ్చే సంస్థల గురించి కూడా తెలుసుకొని ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రంథాలు వాటి రచయితలను గురించి తెలుసుకోవాలి.
ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన గ్రంథాలు, ప్రసిద్ధ తెలుగు గ్రంథాలు, వాటి రచయితల గురించి కూడా చదవడం మంచిది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వివిధ రంగాలలో కృషిచేసిన ప్రముఖుల గురించి కూడా తెలుసుకొని ఉండాలి. వాటితోపాటు జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, వివిధ వారోత్సవాలు, ప్రత్యేక సంవత్సరాలు, యు.ఎన్‌.. సంవత్సరాలు దశాబ్దాలు, సార్క్సంవత్సరాలు దశాబ్దాలు వంటి అంశాలను కూడా చదవాలి.
కరెంట్అఫైర్స్లో ప్రధానంగా లేటెస్ట్క్రీడలు, (ఒలింపిక్స్‌, పారాలింపిక్స్మొదలగునవి) అవార్డులు, సభలుసమావేశాలు, నియామకాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ప్రముఖులు, మరణాలు, ప్రముఖుల పర్యటనలు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలను చదవాలి. జనరల్నాలెడ్జిని ఎప్పటికప్పుడు అప్డేట్చేసుకోవాలంటే కరెంట్అఫైర్స్ను పాలో అవ్వాలి.
జనరల్అవేర్నెస్అనేది విద్యాభ్యాసంలో అంతర్భాగంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి పదవ తరగతిలోపు భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం వంటి విభిన్న అంశాలు చదివేది ఇందుకే. జనరల్నాలెడ్జి విభిన్న అంశాలన్నింటిలో ఒక్క వ్యక్తీ నిపుణుడు కాలేడు. అలా అని వీటిపై పరిజ్ఞానం సాధించడం అసాధ్యమేమీకాదు. దానికి శ్రద్ధాసక్తులతో ప్రణాళిక, సుదీర్ఘ ప్రిపరేషన్తప్పనిసరి. నిర్ధిష్ట ప్రణాళికను క్రమపద్ధతి ప్రకారం అమలు చేస్తే జనరల్అవేర్నెస్పై పట్టు సాధించి మంచి మార్కులు సాధించవచ్చు.
ఇంటర్వ్యూ : రాతపరీక్ష అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. రాతపరీక్షలో మెరిట్సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ప్రిపరేషన్విధానం : ఆర్పిఎఫ్పరీక్షల్లో విజయసాధనకు వేగం, కచ్చితత్వం ఎంతో ఆవశ్యకం. గుడ్డిగా గుర్తించే సమాధానాల్లో ఎక్కువ భాగం తప్పులు పోయే ప్రమాదముంది. నెగిటివ్మార్కులు ఉండటం వల్ల వచ్చిన మార్కులు కూడా తగ్గే అవకాశముంది. గత ప్రశ్నా పత్రాలను ఎన్ని ఎక్కువగా ప్రాక్టీస్చేస్తే అంత ఎక్కువ స్పీడ్వస్తుందని గుర్తుంచుకోండి.
ఆర్పిఎఫ్పరీక్షలలో సమయపాలన ఎంతో ముఖ్యం. నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ లెక్కలు చేయగల్గాలి. ఇది మంచి ప్రాక్టీస్ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ప్రాక్టీస్కోసం మీరు వీలైనన్ని ఎక్కువ గత ప్రశ్న పత్రాలను చేయాలి. మేథమెటిక్స్లో మంచి ఫౌండేషన్సంపాదించిన తరువాత గత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్చేయటం వల్లనే పూర్తి ప్రయోజనం పొందగల్గుతారు.
పోటీపరీక్షలకు గత ప్రశ్నాపత్రాలను పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్చేయటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్చేయడమంటే ఇచ్చిన సమాధానాలను చూడకుండా పరీక్షకు నిర్ణయించిన టైంలో సమాధానాలు గుర్తించి తరువాత మాత్రమే పుస్తకంలో ఇచ్చిన సమాధానాలను చూచి వచ్చిన మార్కులతో మన ప్రగతిని నిర్ణయించుకోవటం. ఇందువల్ల మనకు వచ్చినవి ఏమిటో రానివి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.రానివాటిని ఇంకోసారి రివిజన్చేసుకోవచ్చు. బ్యాంక్గత ప్రశ్నపత్రాలను కూడ విధంగా పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్చేయండి. ఇందుకోసం ప్రతియోగి తాకిరణ్‌, కాంపిటీషన్సక్సెస్వంటి పత్రికలు ఎంతో ఉపకరిస్తాయి. గత ప్రశ్న పత్రాలను ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్చేస్తే అంత స్పీడ్వస్తుంది. ఇంగ్లీషు అయితే స్పీడ్తో పాటు భాష కూడ వస్తుంది.
ఇంగ్లీషు విభాగంలో ప్రాక్టీస్చేసేటప్పుడు కేవలం కరెక్ట్సమాధానాన్ని తెలుసుకోవటంతోనే సరిపుచ్చకుండా తెలియని మాటలకు ఇడియమ్స్కు అర్థాలను తెలుసుకొని గుర్తుంచుకోవాలి. కాంప్రెహెన్షన్పాసేజెస్లో తెలియని మాటలకు అర్థాలను డిక్షనరీ సహాయంతో తెలుసుకొని గుర్తుంచుకోవాలి. వేరే నోట్బుక్పై నోట్చేసుకోవాలి. దీనిని అప్పుడప్పుడు రివిజన్చేస్తుండాలి. విధంగా చేయటం వల్ల ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా పెంపొందుతుంది. స్పీడ్వస్తుంది.
ఆర్పిఎఫ్పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొనే సమస్య సమయం సరిపోకపోవటం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సిరావటం వల్ల బాగా ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి గతంలో జరిగిన పరీక్షల పేపర్లు ఎక్కువగా సాధన చేయాలి. ఒకసారి చేసిన పేపర్ను కూడా మరోసారి సాధన చేయటం ద్వారా మంచి ప్రావీణ్యం సంపాదించవచ్చు.


ఈ సమాచారము అంకుశం.కం  నుండి సేకరించింది.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF