Total Pageviews

Monday, September 5, 2011

రామాయణం అరణ్యకాండలో సీతారామలక్ష్మణుల వనవాసం వర్ణన ఉంది



రామాయణం అరణ్యకాండలో సీతారామలక్ష్మణుల వనవాసం వర్ణన ఉంది. 1650 సంవత్సరానికి చెందిన బొమ్మలో వారి జీవన విధానం చూపారు. సీత పర్ణశాలలో వంట వండడం, రామ లక్ష్మణులకు భోజనం వడ్డించడం, రాముడు యజ్ఞం చేసుకోవడం, లక్ష్మణుడు మాంసం కాల్చడం..  వంటి వనవాస జీవిత విధానాన్ని చక్కగా చిత్రిక పట్టిన చిత్రం ఇది.

పంచవటిలో నివాసం

మేవార్ శైలివారిని గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు. తాను దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు.

పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు. పంచవటిలో ఉండగానే రావణుడి చెల్లెలు శూర్పణఖ రామలక్ష్మణులను చూడటం రాముడిని మోహించడం, లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయడం, తదనంతర కథ రామాయణాన్నే మలువులు తిప్పడం తెలిసిందే కదా.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF