సూర్య పేపర్ లోని వార్త, అవును మనం ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే రాబోవు కాలంలో జంతువులు లేకుండా పోతాయి అయితే మన సెలబ్రిటీలు చేస్తున సేవకు నాకు చాల సంతోషంగా ఉంది, దయచేసి మీరు కూడా జంతువులపై ప్రేమచుపించండి.అంతేకాదు జంతుబలులను ఆపండి,
Surylo vachina news unaadhiunaattugaa
సెలబ్రిటీల జంతుప్రేమ
పెటాను 1980 సంవత్సరంలో న్యూకిర్క్, జంతు హక్కుల ఉద్యమకారుడు అలెక్స్ పచెకోలు కలిసి ప్రారంభించారు. 1981లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మేరీల్యాండ్లో 17 సిల్వర్ స్ప్రింగ్ కోతులను హింసిస్తూ పరిశోధనలు జరపడం పట్ల పెటా ఆందోళనలను చేపట్టింది. వారి ఆందోళనల ఫలితంగా అమెరికా ప్రభుత్వం 1985లో దేశ జంతు సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పోలీసులు యుఎస్ఎలోని జంతు పరిశోధనశాలపై దాడులు నిర్వహించి మూసివేయించింది. ఈ సంఘటనతో పెటా అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ సంస్థ జంతువులను తినడం, ఫర్ దుస్తులను తయారుచేయడం, జంతువులపై పరిశోధనలు, వాటిని హింసిస్తూ వినోదాన్ని అందించడంపై వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి ప్రజల్లో ప్రచారాన్ని చేపట్టింది. మూగజీవాల హింస, చంపడం చేయకూడదని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. కాక్ ఫైటింగ్ డాగ్ ఫైటింగ్, బుల్ఫైటింగ్ వంటి వాటిని నిషేధించాలని ఆయా దేశాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
పెటా ప్రచారంలో ఇండియన్ సెలబ్రిటీలు..
పెటా ప్రచారంలో హాలీవుడ్ తారలు ఎందరో ముందున్నారు. చార్లిజ్ థెరాన్, సిండీ క్రాఫ్వర్డ్, కిమ్ బాసింజర్, పమేలా ఆండర్సన్, రోజర్ మూర్, బ్రియాన్ ఆడమ్స్ వంటి సెలబ్రిటీలు పెటా ప్రచారంలో ముందుంటున్నారు. ఇక మన దేశానికి చెందిన పలువురు బాలీవుడ్ తారలు, సూపర్ మోడల్స్ పెటా ప్రచారంలో పాల్గొంటూ జంతు సంరక్షణలో తాము కూడా ముందుంటున్నామని చాటుకుంటున్నారు.
సెలీనా జైట్లీ...
బాలీవుడ్ అందాల తార సెలీనా జైట్లీ జంతు ప్రేమికురాలు. ఆమె పెటా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. దేశంలో సంఖ్య తగ్గిపోతున్న ఏనుగులను సంరక్షించుకోవాలని ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పెటా ప్రకటనలో ఆమె దర్శనిమిచ్చారు. ఈ ప్రకటనలో సెలీనా ఏనుగు మాదిరిగా గొలుసులతో బంధించబడి ఉండగా ఆమెను హింసిస్తున్న వ్యక్తులు కనిపిస్తారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాకేష్ శ్రేష్ట ఈ ఫొటో తీశారు. దేశంలోని వివిధ జూ పార్క్లలో ఏనుగులను బంధిస్తూ వాటి స్వేచ్చను హరిస్తున్నారని, ప్రజల వినోదం కోసం సర్కస్లలో వాటిని హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్విట్జర్లాండ్లోని ఓ కార్యక్రమంలో పాల్గొని ఏనుగుల సంక్షేమం కోసం ఒక మిలియన్ స్విస్ ఫ్రాంక్లను సేకరించడం విశేషం. గత ఏడాది మాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఏనుగులను సంరక్షించాలంటూ ఉన్న నినాదంతో ఆమె గ్లామరస్గా దర్శనమిచ్చారు.
అక్కినేని అమల...
టాలీవుడ్ హీరో నాగార్జన సతీమణి అయిన అక్కినేని అమల జంతువుల సంరక్షణ కోసం స్వయంగా బ్లూ క్రాస్ సంస్థను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంస్థ ద్వారా పలు మూగజీవాలను ఆమె సంరక్షిస్తున్నారు. దీంతో పాటు ఆమె పెటా ప్రచారంలో కూడా ముందుంటుండడం విశేషం. ‘చేపలను తినకూడదు..’ అంటూ పెటా విడుదల చేసిన ప్రకటనలో ఆమె చేప ఆకారంలో అందర్నీ ఆకట్టుకున్నారు. సముద్రజీవులను సంరక్షించుకోవాలంటూ ఆమె ప్రచారాన్ని నిర్వహించారు.
శిల్పాశెట్టి..
పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి సైతం పెటా ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఆమె పులులు, సింహాలను హింసించకూడదని ప్రచారాన్ని నిర్వహించారు. వాటిని హింసిస్తూ ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్న సర్కస్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెటా విడుదల చేసిన ప్రకటనలో శిల్పా శెట్టి పులి వేషంలో కనిపిస్తూ మురిపిస్తా రు. అంతరించిపోతున్న పులులు, సింహాలను రక్షించు కోవల్సిన బాధ్యత మనందరి పైన ఉందంటూ ఆమె ప్రజలకు సందేశాన్ని అందించారు.
యానా గుప్తా..
బాలీవుడ్ ఐటమ్గర్ల్ యానాగుప్తా సైతం జంతు ప్రేమికురాలే. తన అందచందాలు, గ్లామర్తో పలు ఐటమ్సాంగ్స్లో యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరాంగి పెటా ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఎలుగుబంట్ల సంరక్షణ కోసం రూపొందించిన పెటా ప్రకటనలో ఆమె పాలుపంచుకున్నారు. మూగజీవాలైన ఎలుగు బంట్లను చంపడం, హింసించడం నేరమంటూ ప్రచారాన్ని చేపట్టారు. పెటా ప్రకటనలో గొలుసులతో బంధించనబడిన ఎలుగుబంటుగా యానా కనిపిస్తారు.
షెర్లీన్ చోప్రా..
బాలీవుడ్ శృంగార తార షెర్లీన్ చోప్రా పెటా ప్రకటనలో మైమరపించారు. ఈ ప్రకటనలో షెర్లీన్ గొలుసులతో బంధించబడి కొరడాతో మంచంపై కనిపిస్తారు. జంతువులను గొలుసులతో బంధించి కొరడాలతో హింసించడం అమానుషమంటూ ఆమె చెబుతారు.
ఇతర సెలబ్రిటీలు...
పక్షులను పంజరంలో బంధించరాదంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం పెటా ప్రచారంలో కనిపించి పక్షుల పట్ల తన ప్రేమను వ్యక్తంచేశారు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ జియాఖాన్ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్లాస్ పొడితే తయారుచేసే మాంజా దారంతో ఎగురవేసే గాలిపటాలు పక్షుల ప్రాణాలను హరిస్తున్నాయంటూ పెటా ప్రచార ఫొటోలో దర్శనమిచ్చి మురిపించారు. శాకాహారమే మేలంటూ.. మూగజీవాలను తినకూడదని బాలీవుడ్ తార మహిమా చౌదరి, వన్యప్రాణులు అడవిలో ఉండాలం టూ...సర్కస్లో కాదని సినీ నటుడు రాహుల్ దేవ్ పెటా ప్రచారంలో దర్శనమిచ్చారు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన సితార్ కళాకారుడు పండిత్ రవిశంకర్ తన తనయురాలు అనౌష్క శర్మతో కలిసి పెటా ప్రచారంలో పాల్గొని మూగజీవాలను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
నోరులేని మూగజీవాలను హింసించడం అనాదిగా చూస్తున్నాము. కోడి,మేక వంటి వాటిని వండుకు తినడం, వాటిని బలివ్వడం, సింహం, పులులు, ఏనుగు, జింకలు వంటి వన్యప్రాణులను వేటాడి చంపడం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మాంసాహారులు మూగజీవాలను తినడం రోజు,రోజుకు పెరుగుతోంది. దీంతో ఈ ప్రాణులు మనిషి హింసకు బలవుతున్నారుు. ఈ నేపథ్యంలో ‘జంతువులు తినడానికి కాదు...వాటి చర్మాలతో తయారైన వస్త్రాలను ధరించకూడదు...వాటిని వినోదం కోసం హింసించకూడదు’అనే నినాదంతో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆప్ ఎనిమల్స్ (పెటా) అనే సంస్థ ప్రచారాన్ని నిర్వహిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తోంది. దాదాపు రెండు మిలియన్ల మంది సభ్యులు కలిగిన ఈ సంస్థ అమెరికాలోని విర్జీనియా నార్ఫోక్ ప్రధాన ేకంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరపున వివిధ దేశాల్లో సినీ తారలు, పలువురు సెలబ్రిటీలు ప్రకటనల్లో దర్శనిమిస్తూ మూగజీవాలను కాపాడాలంటూ కోరుతున్నారు. మన దేశానికి చెందిన పలువురు బాలీవుడ్గ తారలు, మోడల్స్, సెలబ్రిటీలు సైతం పెటా తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పెటాను 1980 సంవత్సరంలో న్యూకిర్క్, జంతు హక్కుల ఉద్యమకారుడు అలెక్స్ పచెకోలు కలిసి ప్రారంభించారు. 1981లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మేరీల్యాండ్లో 17 సిల్వర్ స్ప్రింగ్ కోతులను హింసిస్తూ పరిశోధనలు జరపడం పట్ల పెటా ఆందోళనలను చేపట్టింది. వారి ఆందోళనల ఫలితంగా అమెరికా ప్రభుత్వం 1985లో దేశ జంతు సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పోలీసులు యుఎస్ఎలోని జంతు పరిశోధనశాలపై దాడులు నిర్వహించి మూసివేయించింది. ఈ సంఘటనతో పెటా అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ సంస్థ జంతువులను తినడం, ఫర్ దుస్తులను తయారుచేయడం, జంతువులపై పరిశోధనలు, వాటిని హింసిస్తూ వినోదాన్ని అందించడంపై వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి ప్రజల్లో ప్రచారాన్ని చేపట్టింది. మూగజీవాల హింస, చంపడం చేయకూడదని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. కాక్ ఫైటింగ్ డాగ్ ఫైటింగ్, బుల్ఫైటింగ్ వంటి వాటిని నిషేధించాలని ఆయా దేశాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
పెటా ప్రచారంలో ఇండియన్ సెలబ్రిటీలు..
పెటా ప్రచారంలో హాలీవుడ్ తారలు ఎందరో ముందున్నారు. చార్లిజ్ థెరాన్, సిండీ క్రాఫ్వర్డ్, కిమ్ బాసింజర్, పమేలా ఆండర్సన్, రోజర్ మూర్, బ్రియాన్ ఆడమ్స్ వంటి సెలబ్రిటీలు పెటా ప్రచారంలో ముందుంటున్నారు. ఇక మన దేశానికి చెందిన పలువురు బాలీవుడ్ తారలు, సూపర్ మోడల్స్ పెటా ప్రచారంలో పాల్గొంటూ జంతు సంరక్షణలో తాము కూడా ముందుంటున్నామని చాటుకుంటున్నారు.
సెలీనా జైట్లీ...
బాలీవుడ్ అందాల తార సెలీనా జైట్లీ జంతు ప్రేమికురాలు. ఆమె పెటా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. దేశంలో సంఖ్య తగ్గిపోతున్న ఏనుగులను సంరక్షించుకోవాలని ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పెటా ప్రకటనలో ఆమె దర్శనిమిచ్చారు. ఈ ప్రకటనలో సెలీనా ఏనుగు మాదిరిగా గొలుసులతో బంధించబడి ఉండగా ఆమెను హింసిస్తున్న వ్యక్తులు కనిపిస్తారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాకేష్ శ్రేష్ట ఈ ఫొటో తీశారు. దేశంలోని వివిధ జూ పార్క్లలో ఏనుగులను బంధిస్తూ వాటి స్వేచ్చను హరిస్తున్నారని, ప్రజల వినోదం కోసం సర్కస్లలో వాటిని హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్విట్జర్లాండ్లోని ఓ కార్యక్రమంలో పాల్గొని ఏనుగుల సంక్షేమం కోసం ఒక మిలియన్ స్విస్ ఫ్రాంక్లను సేకరించడం విశేషం. గత ఏడాది మాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఏనుగులను సంరక్షించాలంటూ ఉన్న నినాదంతో ఆమె గ్లామరస్గా దర్శనమిచ్చారు.
అక్కినేని అమల...
టాలీవుడ్ హీరో నాగార్జన సతీమణి అయిన అక్కినేని అమల జంతువుల సంరక్షణ కోసం స్వయంగా బ్లూ క్రాస్ సంస్థను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంస్థ ద్వారా పలు మూగజీవాలను ఆమె సంరక్షిస్తున్నారు. దీంతో పాటు ఆమె పెటా ప్రచారంలో కూడా ముందుంటుండడం విశేషం. ‘చేపలను తినకూడదు..’ అంటూ పెటా విడుదల చేసిన ప్రకటనలో ఆమె చేప ఆకారంలో అందర్నీ ఆకట్టుకున్నారు. సముద్రజీవులను సంరక్షించుకోవాలంటూ ఆమె ప్రచారాన్ని నిర్వహించారు.
శిల్పాశెట్టి..
పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి సైతం పెటా ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఆమె పులులు, సింహాలను హింసించకూడదని ప్రచారాన్ని నిర్వహించారు. వాటిని హింసిస్తూ ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్న సర్కస్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెటా విడుదల చేసిన ప్రకటనలో శిల్పా శెట్టి పులి వేషంలో కనిపిస్తూ మురిపిస్తా రు. అంతరించిపోతున్న పులులు, సింహాలను రక్షించు కోవల్సిన బాధ్యత మనందరి పైన ఉందంటూ ఆమె ప్రజలకు సందేశాన్ని అందించారు.
యానా గుప్తా..
బాలీవుడ్ ఐటమ్గర్ల్ యానాగుప్తా సైతం జంతు ప్రేమికురాలే. తన అందచందాలు, గ్లామర్తో పలు ఐటమ్సాంగ్స్లో యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరాంగి పెటా ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఎలుగుబంట్ల సంరక్షణ కోసం రూపొందించిన పెటా ప్రకటనలో ఆమె పాలుపంచుకున్నారు. మూగజీవాలైన ఎలుగు బంట్లను చంపడం, హింసించడం నేరమంటూ ప్రచారాన్ని చేపట్టారు. పెటా ప్రకటనలో గొలుసులతో బంధించనబడిన ఎలుగుబంటుగా యానా కనిపిస్తారు.
షెర్లీన్ చోప్రా..
బాలీవుడ్ శృంగార తార షెర్లీన్ చోప్రా పెటా ప్రకటనలో మైమరపించారు. ఈ ప్రకటనలో షెర్లీన్ గొలుసులతో బంధించబడి కొరడాతో మంచంపై కనిపిస్తారు. జంతువులను గొలుసులతో బంధించి కొరడాలతో హింసించడం అమానుషమంటూ ఆమె చెబుతారు.
ఇతర సెలబ్రిటీలు...
పక్షులను పంజరంలో బంధించరాదంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం పెటా ప్రచారంలో కనిపించి పక్షుల పట్ల తన ప్రేమను వ్యక్తంచేశారు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ జియాఖాన్ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్లాస్ పొడితే తయారుచేసే మాంజా దారంతో ఎగురవేసే గాలిపటాలు పక్షుల ప్రాణాలను హరిస్తున్నాయంటూ పెటా ప్రచార ఫొటోలో దర్శనమిచ్చి మురిపించారు. శాకాహారమే మేలంటూ.. మూగజీవాలను తినకూడదని బాలీవుడ్ తార మహిమా చౌదరి, వన్యప్రాణులు అడవిలో ఉండాలం టూ...సర్కస్లో కాదని సినీ నటుడు రాహుల్ దేవ్ పెటా ప్రచారంలో దర్శనమిచ్చారు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన సితార్ కళాకారుడు పండిత్ రవిశంకర్ తన తనయురాలు అనౌష్క శర్మతో కలిసి పెటా ప్రచారంలో పాల్గొని మూగజీవాలను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment