సూర్య పేపర్ లో వచ్చిన వార్త నడుము నొప్పి గురించి చాలాబాగా వివరించారు.
Surya pepar lo vachina vartha edhi (nadumu noppiki)
నడుం నొప్పికి దూరంగా....(nadumu noppiki dhuramga)
పలువురు నేడు నడుంనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఆడ,మగ అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు. ఈ మధ్య నడి వయస్కుల్లో ఎక్కువ శాతం మంది ఎప్పుడో ఒకసారి నడుంనొప్పి బాధకు గురవుతున్నారు. ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటే వెన్నునొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు.

నిలబడేటప్పుడు...
నిలబడినప్పుడు తల భుజాల మధ్య బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనికి అనుగుణంగా మెడ, వీపు, ఛాతి ఉండాలి. సరిగా నిలబడలేనివారి వెన్నుపై ఒత్తిడి పడి నడుంనొప్పి రావచ్చు.
కూర్చొనేటప్పుడు...
కుర్చీలో కూర్చొని పనిచేసుకుటేప్పుడు కాళ్లు ఫ్లోర్పై ఫ్లాట్గా ఉంచాలి. మోకాళ్లు, తొడలు 90 డిగ్రీల ఆకారంలో ఉండేటట్టు చూసుకోవాలి. వీపు చైర్కు ఆనుకొని ఉండాలి.
కంప్యూటర్ ముందు...

పడుకునేటప్పుడు...
పడుకునేటప్పుడు ముందు మంచంపై కూర్చోవాలి. ఆ తర్వాత కాళ్లను పైకి లేపి మంచంపై పెట్టి మెల్లిగా దిండుపై పడుకోవాలి. మంచంపై వెల్లకిలా పడుకుంటే మోకళ్ల కింద చిన్న దిండును పెట్టుకోవాలి. వెన్నుపై భారం పడకుండా పడుకోవాలి. పొట్టవైపు పడుకుంటే పొట్టకింది భాగాన చిన్న టవల్ను పెట్టుకోవాలి.
- డాక్టర్ ఎం.మంజునాథ్,
ఫిజియోథెరపీ, పిజి డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ న్యూట్రీషన్,
వివేకానంద హాస్పిటల్,
బేగంపేట్, హైదరాబాద్.
సెల్ నెం.9849469102, 9966055882.
ఫిజియోథెరపీ, పిజి డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ న్యూట్రీషన్,
వివేకానంద హాస్పిటల్,
బేగంపేట్, హైదరాబాద్.
సెల్ నెం.9849469102, 9966055882.
hi saar chalabaga vivarinchaaru
ReplyDeletealaage chala samachaaramusekarinchaaru.