Total Pageviews

Wednesday, August 31, 2011

మట్టి వినాయకుడికే పూజల చేద్దాము.











వినాయకచవితి సంబరాలు మొదలవబోతున్నాయి. మనం ఆకర్షణీయంగా కనిపించే వినాయకుడి విగ్రహాలు కాలుష్యకారకాలవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణవేత్తలు హెచ్చరికలు, విజ్ఞప్తులు చేస్తున్నారు. కాలుష్యాన్ని నివారించే మట్టి వినాయకుడు, పేపర్ వినాయకుడిని వినియోగించాలని సూచిస్తున్నారు.


వినాయకచవితి సంబరాల్లో ఎప్పుడూ ఒక పోకడ కనబడుతూ ఉంటుంది. పక్క వీధిలో వినాయకుడి విగ్రహం కంటే తమ వీధిలోని వినాయకుడే అందంగా, ఎత్తుగా ఉండాలని తాపత్రయపడుతుంటారు. భక్తి మంచిదే కానీ పర్యావరణ కాలుష్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వినాయకుడి నిమజ్జనం సమయంలో నీటి కాలువలకు, చెరువులకు కలిగే హానిని గుర్తించాలి. అందుకే పర్యావరణానికి చేటు కలిగించే రంగురంగుల వినాయకుడి విగ్రహాలకన్నా మట్టివిగ్రహాలను వినియోగించడం మంచిది.

Sunday, August 28, 2011

శ్రీ రామ రక్షా స్తోత్రమ్

శ్రీ రామ రక్షా స్తోత్రమ్


చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ||

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ||

సా సితూణ ధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్ ||

రమరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ||

కౌసల్యో దృశౌ పాతు విశ్వామిత్రాః ప్రియః శృతీ |
ఘ్రాణం పాతు ముఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః ||

జిహ్వం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భజౌ భగ్నేశ కార్ముకః ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవద్రాశ్రయః ||

సుగ్రీవేశః కటీ పాతు సకినీ హనుమత్ర్పభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః ||

ఏతాం రామ బలోపేతాం రక్షా యస్సుకృతీ పఠేత్ |
స చిరాయఃస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ||

పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః |
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతివాస్మరన్ |
నరో నలిప్యతేపాపై ర్భుక్తిం ముక్తిం చవిందతి ||

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నభి రక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః ||

వజ్ర పంజర నామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ||

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షా మియాం హరః |
తథా లిఖితవాన్ పాత్రః ప్రభుద్ధో బుధకౌశికః ||

ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదమ్ |
అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీ మాన్ననః ప్రభుః ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినంబరౌ ||

ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథ సైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వ ధనుష్మతామ్ |
రక్షఃకుల నిహంతరౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ||

అత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగ నిసంగసింగినౌ |
రక్షనాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపభాణధరో యువా |
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః ||

రామో దశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః |
జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః ||

ఇ త్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్దయాన్వితః |
అశ్వమేథాదికం పుణ్యం సంప్రాప్నోతి న శంశయః ||

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతావాసనమ్ |
స్తువంతి నామభిర్ధివ్యైర్నతే సంసారిణో నరాః ||

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సితాపతిం సుందరమ్
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ||

రామాయ రాభద్యాయ రామచంద్రాయ వేతనే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

శ్రీరామ రామ రఘునందన రామరామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ ||

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ||

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి ||

శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపధ్యే ||

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యన్య తం వందే రఘునందనమ్ ||

లోకాభిరామం రణరంహధీరం |
రాజీవనేత్రం రఘువంశ నాథమ్ ||

కారుణ్యరూపం కరుణాకరం తం |
శ్రీరామచంద్రం శరనం ప్రపద్యే ||

మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూథ ముఖ్యమ్
శ్రీరామదూతం శరనం ప్రపద్యే ||

కుజతం రామ రామేతి మధురంమధురాక్షరమ్ |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మికి కోకిలం ||

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదమ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ ||

రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తిపరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ||

(ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షా స్తోత్రం సంపూర్ణం)

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం


జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //

జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ //

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి //

సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే /
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా //

అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః /
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః //

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ //

శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే /
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //

పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే /
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా //

తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే /
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి //

లక్ష్మిత్వయాలంకృత మానవా యే /
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః //

గుణై ర్విహీనా గుణినో భవంతి /
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః //

లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ /
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే //

లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం /
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః /
అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే /
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ //

దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ /
కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు //

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ /
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ //

త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ //
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //

నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //

దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః /
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే //

ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా //

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః /
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ //

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి /
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి //

యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //

పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః /
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ /

విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ //

రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః /
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా //

న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //

సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా /
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా //

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం


జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //

జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ //

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి //

సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే /
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా //

అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః /
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః //

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ //

శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే /
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //

పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే /
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా //

తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే /
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి //

లక్ష్మిత్వయాలంకృత మానవా యే /
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః //

గుణై ర్విహీనా గుణినో భవంతి /
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః //

లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ /
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే //

లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం /
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః /
అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే /
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ //

దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ /
కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు //

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ /
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ //

త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ //
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //

నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //

దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః /
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే //

ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా //

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః /
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ //

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి /
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి //

యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //

పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః /
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ /

విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ //

రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః /
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా //

న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //

సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా /
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా //

భగవద్గీత ప్రథమాధ్యాయము

భగవద్గీత ప్రథమాధ్యాయము
రణరంగమున సైనిక పరిశీలనము
ప్రతిపక్షసైన్యములు యుద్ధమునకు సిద్ధపడగా యుద్ధము నొనరించి ప్రాణత్యాగము చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరుసైన్యములందును గాంచెను. కరుణ మరియు విషాదములుచే జయింపబడినవాడై, బలమును కోల్పోయి, మనస్సు భ్రాంతిమయము కాగా అతడు యుద్ధనిశ్చయమును త్యజించెను.
1ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
2.దృష్ట్వా తు పాణ్ణవానీకం వూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు పలికెను: ఓ రాజా! పాండవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచి దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఇట్లు పలికెను.
3.పశ్యైతాం పాణ్ణుపుత్రాణామాచార్య మహతీం చమూహ్|
వూఢాం ద్రుపదపుతేణ తవ శిష్యేణ ధీమతా||
ఓ ఆచార్యా! సూక్ష్మబుద్దికలవాడునూ, మీ శిష్యుడునూ అగు ద్రుపదతనయునితో దక్షతగా నేర్పాటు చేయబడిన పాండవ సైన్యవ్యూహమును గాంచుము.
4.అత్రశూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధిః|
యుయుదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః||
ఈ సైన్యము నందు భీమర్జునౌలతో సమానముగా యుదము చేయగల శూరులైన ధనుర్దరులు పెక్కుమంది కలరు. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు అటువంటి మహాయోధులు.
5.ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్|
పురుజిత్ కున్తిబోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః||
మహారీరులైన ధృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యులును అందున్నారు.
6యధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
పరాక్రమవంతుడైన యుయుధానుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, స్సుభద్రాతనయుడు, ద్రౌపదికుమారులను అందున్నారు. వీరందరును గొప్పయోధులు.
7అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్ధం తాన్ బ్రవీమి తే ||
కాని ఓ బ్రాహ్మణోత్తమా! మీకు తెలియుట కొరకు నా సైన్యమును నడుపుటకు సమర్ధులైన నాయకులగూర్చి నేను తెలియజేసెదను.
8భవాన్ భీష్మశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యము నందున్నారు.
9న్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః|
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః||
నాకొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్దపడియున్న వీరులు పలువురు వున్నారు. వారందరును వివిధ శస్త్రాస్త్రసంపన్నులును మరుయు యుద్ధవిశారదులునునై యున్నారు.
10.అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్|
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్||
పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడు మన సైన్యము అపరిమితముగా నున్నది. కాని భీమునిచే జాగురూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.
11.అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః|
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి|| సేనావ్యూహ ద్వారమునందలి ఆయా ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునికు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి యున్నది. 12.తస్య సంజనయన్ హర్షం కురువృద్దః పితామహః|
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్||
అప్పుడు కురువృద్దుడును, పితామహుడును భీష్ముడు దుర్యోధనున కానందమును గూర్చుటకు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా శంఖమును పూరించెను.
13తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః|
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోభవత్||
తరువాత శంఖములు, పణవానకములు, భేరులు,కొమ్ములు ఆదివి ఏకకాలమున మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను.
14తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ|
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః||
అంతట పాండవసైన్యము నందు శ్రీకృష్ణార్జునులు తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన రథమునందు నందు ఆసీనులైనవారై వారి యొక్క దివ్య శంఖములను పూరించిరి.
15పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః|
పౌణ్డ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః||
శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమను శంఖమును పూరింపగా, అర్జనుడు దేవదత్తమును శంఖమును, ఘనకార్యములు చేయువాడును, భోజనప్రియుడును అగు భీముడు పౌండ్రమను మహాశంఖమును పూరించిరి.
16-18.అనస్త విజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః|
నకుః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ||
కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖణ్డీ చ మహారథః|
ధృష్టదుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే|
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ము పృథక్ పృథక్||
ఓ రాజా! కుంతీ పుత్రుడైన యుధిష్థిరుడు అనంతవిజయమను శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదితనయులు, గొప్ప బాహువులు కలగిన సుభద్రాతనయుడాది వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి
19.సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్య్దారయత్|
సభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్||
భూమ్యాకాశమ్లను ప్రతిధ్వనింపజేయుచు చెలరేగిన ఆ శంఖధ్వానములు ధృతరాష్ట్ర తనయుల హృదములను బ్రద్దలు చేసెను.
20.అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజః|
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః|
హృషీకేశం తదా వాక్యమిదమాహ మాహ మహీపతే||
ఓ రాజా! అంతట కపిధ్వజము కూర్చబడిన రథము నందున్న అర్జనుడు ధనస్సును చేపట్టి, బాణములను విసురుటకు సిద్దపడి, వ్యూహముగా ఎదుట నిలచియున్న కౌరవులను గాంచి శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.
21-22.అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత|
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్||
కైర్మయా సహ యోద్ధ్వ్యమస్మిన్ రణసముద్యమే||
అర్జనుడు పలికెను : ఓ అచ్యుతా! రెండు సేనల నడుమ నా రధమును నిలుపుము. తద్వారా యుద్ధము నొనరించుటకు చేరిన వారిని మరియు ఈ సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.
23.యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః|
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః||
దుష్టబుద్ది గల దృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
24.సంజయ ఉవాచ : ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత|
సేనయోరుభయోర్మధ్యే స్థాపయుత్వా రధోత్తమమ్||
సంజయుడు పలికెను : ఓ భరత వంశీయుడా! అర్జునునిచే అట్లు సంబోధింపబడినవాడై హృషీకేశుడైన శ్రీకృష్ణుడు ఉత్తమమైన తన రధమును ఇరుసేనల నడుమ నిలిపెను.
25.భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహిక్షితామ్|
ఉవాచ పార్ధ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి||
భీష్ముడు,ద్రోణుడు, ఇతర సర్వ భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు అర్జునునుద్దేశ్యించి " ఓ పార్ధా! ఇచ్చట కూడియున్నటు వంటి కురువంశీయులను గాంచుము" అని పలికెను.
26.తత్రపశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్|
ఆచార్యాన్మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ సఖీన్ తథా|
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి||
అంతట అర్జునుడు ఇరుసేనల యందలి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
27.తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బన్ధూనవస్థితాన్|
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్||
సర్వవిధ బంధువులను, స్నేహితులను గాంచిన అర్జనుడు అంతట దయార్ద్రహృదయుడై ఇట్లు పలికెను.
28.అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ |
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
అర్జనుడు పలికెను : ఓ కృష్ణా! యుద్ధోత్సాహమున నాయెదుట నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచినంత నా శరీరావయవములన్నియును కంపించుచున్నవి. నోరు ఎండిపోచున్నది.
29.వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే|
గాణ్ణీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే||
దేహంమంతయు కంపించుచు రోమాంచమగుచున్నది. గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది, నాచర్మము మండిపోవుచున్నది. 30.న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః|
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ||
నేను ఏమాత్రం నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణా ! కేశిసంహారీ ! అపశకునములను మాత్రమే గాంచుచున్నాను.
31.న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ||
ఓ కృష్ణా! యుద్దమందు స్వజనమును చంపుట ద్వారా ఎట్లు మేలు కలుగగలదో నేను గాంచలేకున్నాను. అలాగుననే యుద్దమునందు విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను.
32-35.కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా |
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ||
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణం స్త్యక్త్వా ధనాని చ |
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ||
మాతులాః శ్వశురాః పౌత్రా శ్యాలాః సంబంధినస్తథా |
ఏతాన్న హన్తుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన ||
అపి త్రైలోకరాజ్యస్య హేతోః కింను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రితిః స్యాజ్జనార్దన ||
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, జీవితమును కోరుచున్నామో వారందరును యుద్ధరంగమున నిలచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమిటి? ఒ మధుసూదనా ! ఆచార్యులు, తల్లిదండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, తాతలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందిరును ఆస్తులను, ప్రాణములను విడచి పెట్టుటకు సంసిద్దులై నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలేను ? ఓ జనార్దనా ! భూలోక రాజ్యమునటుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్దము చేయుటకు సిద్దముగా లేను. దృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము ?
36.పాపయేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః |
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్ స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||
ఇట్టి దుర్మార్గులను చంపుట వలన మాకు పాపమే సంక్రమిస్తుంది. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితముకాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణా ! స్వజనమును చంపుట మాకు కలుగు లాభమేమి? మేమెట్లు సుఖముగా నుండగలము?
37-38.యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన||
ఓ జనార్దనా ! వీరందరును లొభపూర్ణ మనస్సు కారణముగా కులక్షయమందుగాని, మిత్రులతో కలహించుట యందుగాని దోషమును గాంచుటలేదు. కాని వంశనాశనము నందు దోషమును గాంచుచున్న మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నిమగ్నులము కావలెను?
39.కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత ||
కులక్షయము వలన శాశ్వతములైన వంశాచారములు నశించిపోవును. తత్కారణముగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు.
40.అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః|
స్త్రిషు దుష్టాసు వార్ ష్ణేయ జాయతే వర్ణసంకరః ||
ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్టివంశసంజాతుడా ! అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్దినొందును.
41.సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః||
దుష్టసంతానపు వృద్ది వలన కుటుంబమునకు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచిన వారికి నరకము ప్రాప్తించును. పిండోదకక్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు.
42.దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః||
వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాప కర్మల వలన కులధర్మములు, జాతిధర్మములు నాశనమగును.
43.ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతిత్యనుశుశ్రమ||
ఓ జనపోషకుడవైన కృష్ణా ! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
44.అహో బత మహత్పాపం కర్తు వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||
అహో ! ఎంత విచిత్రము ! రాజ్యసుఖము ననుభవించవలెనను లోభముచే స్వజనమును చంపుట వంటి ఘోరపాపకార్యమును చేయుటకు మేము సిద్దపడియుంటిమి.
45.యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరంక్ భవేత్ ||
నిరాయుధుడను, ప్రతికారము చేయని వాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమున వధించినచో అదినాకు క్షేమకరమేకాగలదు.
46.సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రధోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||
సంజయుడు పలికెను : రణరంగము నందు అర్జనుడిట్లు పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖకల్లోలిత మనస్సుచే రథమునందలి ఆసీనముపై కూర్చుండిపోయెను.

వివాహమెందుకు?

వివాహమెందుకు?


ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.
1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.

ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.

1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.

2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.

3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.

జాతకములు లేదా పంచాంగ వెబ్ సైట్స్

జాతకములు లేదా పంచాంగ వెబ్ సైట్స్ 
మీ యొక్క జాతకములు మరియు పెళ్లి సమాచారమును జాతకచాక్రమును  ముహుర్తవిశయములను 
మీజన్మనక్షత్ర వివరములను అంతేకాకుండా పండగ విశేషములను తెలుసుకోవచ్చు,
http://epanchangam.com/
www .mypanchang .com

తెలుగు బ్లాగర్లు మీరు బ్లాగునలు ఇక్కడ చూడవచ్చు

మీరు బ్లాగునలు ఇక్కడ చూడవచ్చు

1. http://jalleda.com

2. http://koodali.org

3. http://thenegoodu.com

4. http://telugubloggers.com

5. http://dir.jalleda.co



Friday, August 26, 2011

నెలల పిల్లలకు ఆహారం ఇలా,Feeding habits for months babies,Weaning for babies


 హాయ్  ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,

Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లోనెలల పిల్లలకు ఆహారం ఇలా,Feeding habits for months babies,Weaning for babies

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నెలల పిల్లలకు ఆహారం ఇలా(Feeding habits for months babies,Weaning for babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనదేశంలో ఎక్కువశాతం పిల్లలు 6నెలల వరకు తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారు. వారి పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే 6నెలల తరువాత నుంచి తల్లిపాలు మాత్రమే సరిపోవు వారి పోషణకు. 6నెలల నుంచి వారి పెరుగుదలకు కావలసిన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. అవసరాలను తల్లిపాలు మాత్రమే తీర్చడం కుదరదు. అందుచేత 6 నెలల తరువాత నుంచి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు లేదా ఇతర ఆహార పదార్థాలను ద్రవరూపంలో గాని, గణరూపంలో అలవాటు చేసే పద్ధతిని వీనింగ్అని అంటారు.

పిల్లలను క్రమంగా తల్లిపాలతో పాటు ఇతర ఆహారానికి అలవాటు చేసే ఆహార పదార్థాలను వీనింగ్ఫుడ్స్అని అంటారు. పాలలో విటమిన్సి చాలా తక్కువగా లభ్యం అవుతుంది. విటమిన్సిని అందివ్వడానికి పిల్లలకు 6నెలల నుండి పండ్ల రసాలను ఇవ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్నిల్వలు లివర్లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకు సరిపోతాయి. తరువాత నుండి ఐరన్ఆహారం ద్వారా వారికి లభించాలి.

పాలలో విటమిన్డి కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా, పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్‌ 6నెలల నుండి ఆరంభించాలి. లేకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

6-12 నెలల పిల్లలు ప్రతిరోజూ తీసుకోవలసిన ఆహారం
పప్పులు-15గ్రాములు, గోధుమలు 30-45గ్రాములు, పాలు 200-500మిల్లీ గ్రాములు(తల్లిపాలు ఇస్తుంటే, 200మిల్లీ లీటర్ల పై పాలు సరిపోతాయి), దుంపలు- 50గ్రాములు, ఆకుకూరలు-50గ్రాములు ఇతర కూర గాయలు 25గ్రాములు, పండ్లు -100గ్రాములు, చక్కెర -25గ్రాములు, వెన్న-10గ్రాములు, 6-12నెలల పిల్లలు 8.6కేజీల వరకు బరువు ఉండాలి. వీనింగ్ఫుడ్స్లేదా సప్లిమెంటరీ ఫుడ్స్‌ 3రకాలుగా చెప్పవచ్చు
లిక్విడ్సప్లిమెంట్స్
ఆహారం 6నెలల నుండి స్టార్ట్చేయాలి. ముఖ్యంగా పాలు 6నెలల నుండి తల్లిపాలు 3-4సార్లు మాత్రమే ఇస్తూ, ఆవుపాలు కాని, గేదెపాలు కాని అలవాటు చేయాలి. పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటుపడటానికి పాలలో కాచి చల్లార్చిన నీళ్ళను పంచదార కలిపి తాగించాలి. పాలు, నీళ్ల శాతం 21గా ఉండాలి. చక్కెరల వల్ల కాలరీలు పెరుగుతాయి.

తాజా పండ్ల రసాలు
ఆరంజ్‌, టమాటో, ద్రాక్ష, వంటి పండ్లు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు కలిపి స్టార్ట్చేయొచ్చు. నీరు, జ్యూస్శాతం 1:1గా ఉండాలి. జ్యూస్ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్మోతాదు పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి.

కూరగాయలతో తయారుచేసిన సూపులు
పండ్లు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్గా చేసి ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగించాలి. తరువాత మెల్లగా వడకట్టకుండా అలవాటు చేయాలి. వీటితో పాటు ఫిష్లివర్ఆయిల్కొన్నిచుక్కలు నుండి అర టేబుల్స్పూన్కొన్ని పాలలో కలిపి ఇవ్వటం వల్ల విటమిన్, విటమిన్డి లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్లను బాగా కలపాలి. జ్యూస్‌, సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7లేదా 8 నెలలో ఆరంభించవచ్చు.

పెరుగుతున్న కాలరీస్‌, ప్రొటీన్ల ఆవశ్యకత వల్ల వాటిని సరైన రీతిలో అందించడానికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్వీట్‌, రాగిని ఆహారంలో చేర్చాలి. మాల్టెడ్తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి, ఒక బట్టలో మూటకట్టి, మొలకలు వచ్చిన తరువాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా వేయించుకోవాలి. తరువాత మొలకలను తీసేసి పౌడర్చేసుకోవాలి. ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, కేరట్స్ను ఇవ్వవచ్చు. కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఆహారపదార్థాల వల్ల పిల్లలు కలర్ఫుడ్కి అలవాటు పడతారు.

పండ్లు
అన్ని రకాల పండ్లు ఉడకబెట్టి, వడకట్టి తినిపించాలి. అవసరం అనిపిస్తే కొంచెం షుగర్కలుపుకోవచ్చు. అరటిపండును మాత్రం ఉడికించవలసిన అవసరం లేదు. మెత్తగా చేసి తినిపించవచ్చు

గుడ్డు
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలాంటి అలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగు తున్నారు అని నిర్ధారించుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించవచ్చు. గుడ్డులోని యోక్లో విటమిన్‌, ఐరన్‌, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్సరం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

పప్పుధాన్యాలు
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి, పొంగలు, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీ సాలిడ్గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చినరోజు గుడ్డు, మాంసం ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకొని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూర గాయలు, మాంసం, పండ్లు (ఉడికించినవి కాని పచ్చివి కాని) పెట్టాలి. ఇడ్లీ, ఇడియాప్పం, ఉప్మా, బ్రెడ్‌, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి.

చిన్నగా కట్చేసిన పండ్లు, కూరగాయాలలో గింజలు ఉంటే అవి తీసేసినవి ఇవ్వాలి. వీటివ్ల దవడలకు మంచి ఎక్సర్సైజ్లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలి తింటారు. కాబట్టి ఎక్కువగా పండ్లు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పిల్లల ఆహార విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించే తల్లి, ఎక్కువగా ఇంట్లో చేసిన వీనింగ్ఫుడ్స్నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారుచేసుకోవాలి. వీటివల్ల కేలరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, ఖనిజాలు తగు మోతాదులో అందించవచ్చు. మంచి పరిశుభ్రమైన ఆహారం కూడా అవుతుంది.

వీటితో ఆకుకూరలను కూడా ఉపయోగించాలి. ఒక్కోసారి ఒకరకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఒక ఆహార పదార్థానికి అలవాటుపడ్డ తర్వాత ఇంకో రకం ఆహారం ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహార పదార్థం అలవాటు చేస్తున్నపుడు ముందుగా ఒక టేబుల్స్పూన్పట్టి ఆగాలి. అది సరిపడితే కంటిన్యూ చేయాలి. లేకపోతే మానేయాలి.ద్రవపదార్థాలు అలవాడు చేసేటప్పుడు అవి చాలా మెత్తగా ఉండేలా చూడాలి. పిల్లలు ఏదైన ఆహారం తినడం ఇష్టపడకపోతే, కొన్నిరోజులు దాన్ని ఆపి మళ్లీ పెట్టాలి.

అప్పుడు కూడా తినకపోతే ఆహారం పెట్టటం ఆపేయాలి. మొదట శుభ్రపర్చిన పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. పిల్లలు బాగా నమిలి ఆహారం తీసుకోగలుగుతుంది అని అనిపించినప్పుడు చిన్న ముక్కలుగా చేసిన తరిగిన పండ్లు, కూరగాయముక్కలు ముఖ్యంగా 8 లేదా 9వనెలలో ఇవ్వచ్చు. కూరగాయలు ముక్కల రూపంలో తినలేక పోతుంటే వాటిని సూప్స్లాగా తయారుచేసి పట్టాలి. వేడిగా ఉన్న ఆహారాన్నే పిల్లలకు ఇవ్వాలి. పండ్లరసాలను గ్లాసులతో కాని, కప్పులతో కాని తాగించాలి. బాటిల్వాడడం మంచిది కాదు.

పైన చెప్పిన పద్దతులన్నీ పాటించినట్లైతే ఒకసంవత్సరం వచ్చేసరికి పిల్లలు ఇంట్లో వండే ఆహారానికి అలవాటు పడతారు. అందరూ తినే ఆహారాన్ని చిన్నచిన్న మోతాదులలో పాలలో కలిపి అలవాటు చేయాలి. గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చి యాపిల్‌, కూరగాయాలు, పాప్కార్న్వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది వస్తుంది.

ఉద్యోగాలు , వ్యాపారాలు చేసే కుటుంబాలు , ఎప్పుడు తీరికలేని వారికి ... బజారు లో అనేక రెడీమేడ్ వీనింగ్ ఫుడ్స్ దొరుకుతాయి . మంచి బ్రాండ్ ని ఎన్నికొని వాడవచ్చును .
  • ============================================
Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF