వినాయకచవితి సంబరాలు మొదలవబోతున్నాయి. మనం ఆకర్షణీయంగా కనిపించే వినాయకుడి విగ్రహాలు కాలుష్యకారకాలవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణవేత్తలు హెచ్చరికలు, విజ్ఞప్తులు చేస్తున్నారు. కాలుష్యాన్ని నివారించే మట్టి వినాయకుడు, పేపర్ వినాయకుడిని వినియోగించాలని సూచిస్తున్నారు.
వినాయకచవితి సంబరాల్లో ఎప్పుడూ ఒక పోకడ కనబడుతూ ఉంటుంది. పక్క వీధిలో వినాయకుడి విగ్రహం కంటే తమ వీధిలోని వినాయకుడే అందంగా, ఎత్తుగా ఉండాలని తాపత్రయపడుతుంటారు. భక్తి మంచిదే కానీ పర్యావరణ కాలుష్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వినాయకుడి నిమజ్జనం సమయంలో నీటి కాలువలకు, చెరువులకు కలిగే హానిని గుర్తించాలి. అందుకే పర్యావరణానికి చేటు కలిగించే రంగురంగుల వినాయకుడి విగ్రహాలకన్నా మట్టివిగ్రహాలను వినియోగించడం మంచిది.
No comments:
Post a Comment