హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. శ్రీకాకుళం )
దంత సంరక్షణ , Dental Care
- పల్లు లేదా దంతాలు (Teeth) దవడలకు అమర్చబడి ఉండి మనం ఆహారాన్ని నమలడానికి ఉపకరిస్తాయి. వీటిమొదలు భాగాలు చిగుళ్ళతో కప్పబడి ఉంటాయి.
మానవులలో రెండు జతల పల్లుంటాయి. ముందుగా చిన్నపిల్లలలో వచ్చే పల్లను పాలపల్లు అంటారు. ఇవి 10 పైదవడకి 10 క్రిందిదవడకి ఉంటాయి. తర్వాత వచ్చే 32 పల్లు శాశ్వతంగా మనిషి జీవితాంతం ఉంటాయి. ఇవి 16 పైదవడకి 16 క్రిందిదవడకి ఉంటాయి. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు క్రింద, పైన, కుడి, ఎడమవైపు ఒకే విధంగా ఉంటాయి.
- కుంతకాలు ఆహారాన్ని ముక్కలు చేయడానికి, రదనికలు చీల్చడానికి, చర్వణకాలు, అగ్ర చర్వణకాలు నమలడానికిఉపయోగపడతాయి. ప్రతి దవడ అర్ధ భాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్ర చర్వణకాలు, మూడుచర్వణకాలు ఉంటాయి. దవడ ఎముక లో ఉండే దంత భాగాన్ని మూలం అనీ, బయటకు కనిపించే భాగాన్ని కిరీటంఅంటారు. దంతం డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతం లోపలఉండే కుహరంలో రక్త నాళాలు, నాడీ తంతువులు ఉంటాయి.
శుభ్రత
- దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒకసారి దంతధావనం చేయాలి. ఈ ప్రక్రియ వల్ల దంతాలలోచేరుకున్న చిన్న ఆహారపు ముక్కలు, పాచి తొలగిపోతాయి.
దంత గార >
- ఒక్కో సారి మా చ్గుల్లపై తెల్లని పదార్ధం పెరుకోవడం చూస్తాం . గోళ్ళతో అలా అనగానే ఇది తొలగిపోతుంది . దీనిని వైద్యభాషలో ఫ్లేక్ (గార) అంటారు ,.
పళ్ళ పైన ఏర్పడే సుక్ష్మ జీవులనే ఫ్లేక్ అంటారు . ఇదొక రకమైన సూక్ష్మజీవి . అనువైన పారిస్తితులలో కేవలం ౧౪ గంటలలో పది లక్షల జీవరఆశిగా మారుతుంది . ఇందులో సగం వెంటనే పంటి పై అంటుకుని గట్టిగా మారుతుంది . దీనిని "సెల్ క్యులాస్ " అంటారు . దీనిని మనం గరదట్టడం అని సాధారనభాషలో అంటు ఉంటాము ఇది పళ్ళపై గట్టి పొరగా మారి ఇతర జబ్బులకు ప్రధాన కారణమవుతుంది .
ఇటు వంటప్పుడు పళ్ళు తోముకునే సమయంలో చిగుళ్ళ నుంచి రక్తం కారడం కనిపిస్తుంది . బ్రష్ తో తోముకోవడం వల్ల చాల వరకు ఈ సమస్య నయమువుతుంది . వైద్యుల అవసరం ఉండదు .
తీసుకో వలసిన జాగ్రత్తలు >
- రోజూ మంచి బ్రష్ , పేస్టు లతో పళ్ళు తోముకోవాలి .
- మౌత్ వాష్ తో గార్గిల్ /పుక్కలించడం చేయాలి ,
- డెంటల్ ఫ్లాష్ ఉపయోగించాలి ,
- ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ ఉన్నా పేస్ట్ తో బ్రష్ చేయాలి .
- తెల్లని పళ్ళ కోసం దంత వైద్యుని సంప్రదించి ఫ్లోష్ చేయించు కుంటే మంచి ఫలితం ఉంటుంది .
దంతసిరి
ముఖ సౌందర్యంలో దంతాల తెల్లదనమూ కీలకపాత్ర పోషిస్తుంది. చక్కటి పలువరస లేకపోతే పదుగురిలో మనసారా నవ్వలేని దుస్థితి. కారణాలేవైనా కానీ పచ్చగా మారిన దంతాలను తెల్లగా మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
జామ, యాపిల్, క్యారెట్, చెరకు, దోస... ఇవన్నీ సహజవైట్నర్లు. తరచుగా తింటుంటే వాటిలో ఉండే రసాయనాలు పంటిపై ఉండే మరకల్ని తొలగిస్తాయి.
టొమాటో, ఉసిరి, స్ట్రాబెరీ వీటితో పళ్లపై రుద్దినా అదే ఫలితం లభిస్తుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు నారింజ తొక్కతో పళ్లు రుద్దుకుంటే అందులోని సి విటమిన్ రాత్రంతా సూక్ష్మజీవులతో పోరాడుతుంది.
అర టేబుల్‌స్పూన్ బేకింగ్సోడాలో అంతే పరిమాణంలో వినెగర్, చిటికెడు ఉప్పు కలిపి తోముకుంటే పళ్ల పచ్చదనం పోయి తెల్లగా అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా కూడా నిల్వ ఉండలేదు.
అర చెంచాడు బేకింగ్ సోడాలో రెండుచుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి కలిపి ఆ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తోముకుంటే క్రమంగా పళ్లు తెల్లగా అవుతాయి.
వేప, నల్లతుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్ గుణాలు పంటికి రక్షణ కల్పిస్తాయి. దుర్వాసనను కూడా తొలగిస్తాయి.
తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దాంతో పళ్లు తోముకున్నా దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి కూడా ఇది మంచి మందు.
దంత సమస్యలు - లేజర్ చికిత్స
దంత సమస్యలకు చికిత్సలో భాగంగా హార్డ్, సాఫ్ట్ టిష్యూలకు లేజర్ చికిత్స చేస్తుంటారు. లేజర్ యంత్రంలో వీటికి చికిత్స చేసే పైప్స్ వేరువేరుగా ఉంటాయి. పలు రకాల చికిత్సలను అందించేందుకు వీలుగా పలు రకాల ప్రోగ్రామ్లు ముందుగానే అందులో లోడ్ అయి ఉంటాయి. ప్రోగ్రామ్ మార్చినప్పు డల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్నివ్వాలి. రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కి మరో ప్రోగ్రామ్...ఇలా హార్డ్ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్లుంటే, సాఫ్ట్ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్లున్నాయి ఈ యంత్రంలో.
సాఫ్ట్ టిష్యూ చికిత్సలో ఉన్న ఎండోడాంటిక్స్ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్ ట్రీట్మెంట్ చెయవచ్చు. బాగాలోతుగా ఉన్న ఇన్ఫెక్షన్ని అరికట్టవచ్చు. పంటినిగాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవసరమైన మేరకు కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్ ద్వారా పన్నుపై భాగాలు అరిగి జివ్వున లాగుతుంటే ఆ ప్రాంతంలోని అతిస్పందనని మరో ప్రోగ్రామ్ ద్వారా.. లేజర్ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్నెస్ని తగ్గించవచ్చు.
సాధారణంగా అధి రక్త్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్తో కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్తో చిగుళ్లని ఓపెన్ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చివేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసివేసే ప్రోగ్రామ్ కూడా ఉంది. కొంతమందిలో రెండు పళ్ల మధ్య ఫ్రీనమ్ అనే కండరం ఏర్పడుతుంటుంది. దీంతో పళ్ల మధ్య సందులు ఏర్పడతాయి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్ని తీసివేయవచ్చు లేజర్ కిరణాలతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్లున్నాయి సాఫ్ట్ టిష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటికీ సంబంధించిన ప్రోగ్రామ్తో ఉన్నాయి ఈ లేజర్ చికిత్సా యంత్రంలో.

హార్డ్ టిష్యూ...
గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్ని, ఎనామెల్ని కట్ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చిపోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్ అండ్ ఫీజర్ సీలింగ్ పద్ధతి’లో మూసివేస్తారు. లేజర్ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయవచ్చు. ఫ్లోరోసిస్వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్ప డుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్లపై భాగంలో సెన్సిటివ్‌నెస్ ఎక్కువగా ఉంటే లేజర్ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్ చేయవచ్చు.
ఎక్కువున్న చిగుళ్లని కట్చేయవచ్చు. గ్రాన్యులేషన్..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్ లేజర్తో తొలగించవచ్చు. ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివే యడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చి వేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురు వాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లోని చిన్నచిన్న పుళ్లమీదకి లేజర్ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గి పోతుంది. ఇరవైనాలుగు గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది. ఎటువంటి మచ్చ పడకుండా కూడా ఉంటుంది.
చిన్నపిల్లల్లో...
చిన్నారుల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకు రావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్ కిరణాలతో నొప్పిలేకుండా చిగుళ్లని కోసి పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్ల మీద జెల్ని రాసి లేజర్ కిరణాన్ని నాలుగునిముషాలు పంపడంతో పళ్లని తెల్లగా చేయవచ్చు.
వెస్టిబ్యులో ప్లాస్టి...
పెదవి లోపలివైపు ఎముకని లేజర్ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరి భాగం కోసుకుంటుంటే ఆ పదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్ కిరణాలను పంపి నొప్పిలే కుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్ టిష్యూ లేజర్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్లున్నాయి.అన్ని రకాల దంత చికిత్సల్నీ లేజర్తో చేయవచ్చు. మెత్తటి కణాలని చికిత్స చేసినా, గట్టికణాన్ని కత్తిరించినా నొప్పి ఉండదు. రక్తం కారదు. చిగుళ్లలో పాడైపోయిన భాగాల్ని చిగుళ్లని కత్తిరించకుండా కాంతిని పంపి మాడ్చేయవచ్చు. సైడ్ ఎఫెక్ట్స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. కేవలం రెండు నిముషాలలో కావలసిన ప్రోగ్రామ్ని సెట్ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ని సెట్చేస్తే లేజర్ కిరణాలు ఆ ప్రోగ్రామ్నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్ పె డితే లేజర్ కిరణాలు ఆ కణాలనే మాడ్చేస్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టుకోకుండా.
ఈ లేజర్ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్ లేజర్ కన్నా ఎన్డిఆర్ లేజర్ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.
లేజర్ అంటే..?
ఒక పద్ధతి లేకుండా ప్రయాణించే అనేక ఎలక్ట్రోమేగ్నిటిక్ వేవ్స్ మాములు కాంతిలో ఉంటాయి. దీనిని ‘ఇన్‌కొహెరెంట్ లైట్’ అంటారు.లేజర్కాంతి కిరణాలకు మూడు ప్రత్యేక ధర్మాలుంటాయి. ఇది తిన్నగా ఒకే దారిలో వెళ్తుంది. దూరం ప్రసరింపచేసిన చాలా కొద్దిగా మాత్రమే వంగుతుంది ఈ కాంతి. ఇందుకు భిన్నంగా మామూలు కాంతికిరణాలు విస్తరిస్తాయి. లేజర్ కిరణాల రెండవ ధర్మం ఒకటే రంగుని కలిగి ఉంటుంది.
మామూలు కాంతిలో ఇందుకు భిన్నంగా ఎన్నో వేవ్‌లెంత్స్ రంగులుంటాయి. లేజర్ యంత్రంలో లేజర్ కేవిటీలో లేజర్ కిరణాలు ఉత్పత్తి అవుతుం టాయి. లేజర్ కేవిటీలో మూడు ముఖ్యమైన విభా గాలున్నాయి. లేజర్ కిర ణాలు ఉత్పత్తి చేసే ప్రాం తం పవర్ జనరేటర్. లేజ ర్ కిరణాలని ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్ జనరేటర్ అనేది ఒక ముఖ్యభాగం. లేజర్ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్ ఘనరూపంలో ఉండవచ్చు. ద్రవరూపం లో ఉండవచ్చు. వాయు రూపలో ఉండవచ్చు. రెండవది యాక్టివ్ మీడియా పరమాణువుల్ని స్టిమ్యూలేట్ చేసే ఎనర్జీ సోర్స్ పల్స్‌డేలో ప్రెజర్ జినాన్ ఫ్లాష్‌లాంప్.మూడవ ముఖ్యమైన భాగం ఆఫ్టికల్ రిజోనేటర్. లేజర్కేవిటీకి రెండు చివర్లలోనూ రెండు హైలిపాలిష్ట్ మిర్రర్స్ ఉంటాయి. ఇవి ఉత్పత్తి అయ్యే లేజర్ కిరణాలు ప్రక్కలకు వెళ్లకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాయి.
లేజర్ కిరణాలు ఉత్పత్తి కాగానే లేజర్‌బీమ్ డెలివరి సిస్టమ్ ద్వారా ముందుకు వెళ్తాయి. అక్కడ నుంచి పైప్ ద్వారా ఆ కిరణాల్ని నోటిలో ఏ ప్రదేశంలోకి పంపాలో ఆ ప్రదేశంలోకి పంపిస్తారు. మనుష్యుల మీద ఈ లేజర్ కిరణాల ప్రభావం లేజర్ యం త్రం నుంచి ఉత్పత్తి ఆయ్యే రేడియంట్ ఎనర్జీవేవ్ లెంత్‌ని బట్టి ఉంటుంది. విచిత్రమేమిటంటే ఎంతో ఎక్కువగా ఉష్ణము లేజర్ కిరణాలలో ఉన్నా ఏమాత్రం కాలదు, నొప్పి అనిపించదు. శరీరంలో ఏ ప్రాంతంలోనయినా ఈ లేజర్ కిరణాలు మనల్ని తాకగానే ఆ ప్రాంత అవయవాలు వాటిని పీల్చు కుంటాయి. ఈ పీల్చుకున్న లేజర్ కిరణాలు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ ప్రకారమే పనిచేస్తాయి. ఎంత ఎక్కువ ఎనర్జీ లోపలకు తీసుకుంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. లేజర్ కిరణాలు ఒక తరంగ దైర్ఘ్యంలో ప్రసరిస్తాయి. లేజర్ ద్వారా ఎంత ఎనర్జీ ఉత్పత్తి అయ్యేది అన్నది పవర్ వైద్యం కోసం ఉపయోగించే లేజర్స్ని పల్స్మోడ్లో ఆపరేట్ చేస్తారు. పల్స్ రిపిటిషన్ రేట్ ప్రకారం లేజర్ కిరణాలు ప్రసరిస్తాయి. సాధారణంగా సెకండుకి 10 పల్స్‌స్ రేట్ ప్రకారం లేజర్ కిరణాలు ప్రసరించేట్టు చూస్తుంటారు.
థెర్మోకోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్ వల్ల గత ఇరవై సంవత్సరాలుగా లేజర్ కిరణా లను దంత వైద్యానికి సంబంధించిన వివిధ చికిత్సలకి ఉపయోగిస్తున్నారు.
సాఫ్ట్ టిష్యూ చికిత్సలకి లేజర్తో బాగా నిర్వహించవచ్చు స్టెరిలైజింగ్ కోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతుల కన్నా ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు.
అనస్తేషియా లాంటి మత్తునిచ్చే మందుల అవసరం అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్ కిరణాలను పంపడం...ఎంత వేగంతో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఇటువంటి లేజర్ చికిత్సలకు భయపడనవసరం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి సులభ పద్ధతుల ద్వారా పంటి సమస్యలను వైద్యులు పరిష్కరించగలుగుతున్నారు.
లేజర్ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్ ఘనరూపంలో ఉండవచ్చు. ద్రవరూపంలో ఉండవచ్చు. వాయురూపలో ఉండవచ్చు. రెండవది యాక్టివ్ మీడియా పరమాణువుల్ని స్టిమ్యూలేట్ చేసే ఎనర్జీ సోర్స్ పల్స్‌డేలో ప్రెజర్ జినాన్ ఫ్లాష్‌లాంప్.
- డాక్టర్ జాన్ అబ్రహం,దంత వైద్య నిపుణులు.
No comments:
Post a Comment