Total Pageviews

Friday, August 26, 2011

మూత్రపిండాల్లో రాళ్ళు , Kidney Stones


హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS.  )
ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం.

మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. రాళ్ళు మూత్రప్రవాహాన్ని అడ్డగించినపుడు ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలే కాకుండా మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా చోటుచేసుకోవచ్చు. జనాభాలో 4-8 శాతం మంది వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నారని అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సమస్య స్ర్తి పురుషుల్లో ఒకే మాదిరిగా కాకుండా కొద్దిపాటి తేడాలతో వ్యక్తమవుతుంది. ఉదాహరణకు పురుషుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలోనూ ఒకరికి రాళ్లు వస్తాయి. అదే మహిళల్లో అయితే ప్రతి 35 మందిలోనూ ఒకరు సమస్యతో బాధపడుతున్నారు.

మూత్రమార్గం అనేది మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం, మూత్రప్రసేకం(urethra) తదితర భాగాలతో నిర్మితమవుతుంది. మూత్రపిండాలు రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోస్తాయి. అంతేకాకుండా రక్తంలో ఉండే లవణాలకు, ఇతర పదార్థాలకు మధ్య సమతుల్యతను మూత్రపిండాలు కాపాడతాయి. మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని కిడ్నీలనుంచి బయల్దేరే మూత్రనాళాలు మూత్రకోశానికి చేరవేస్తాయి. మూత్రకోశం అనేది ఒక తిత్తివంటి నిర్మాణం. వ్యాకోచం చెందటం ద్వారా మూత్రాన్ని విసర్జన సమయం వరకూ నిల్వ చేస్తుంది. మూత్రకోశం పూర్తిస్థాయి సామర్థ్యం వరకూ నిండిన తరువాత నాడీ సంకేతాలను అనుసరించి మూత్రప్రసేకం తెరుచుకొని మూత్రాన్ని వెలుపలకు పంపిస్తుంది.

మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాలవల్ల రాళ్లు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ప్రక్రియను వైద్య పరిభాషలోయూరోలిథియాసిస్అంటారు. మూత్రపిండాల్లో తయారైన రాళ్లు, చిన్న ఆకృతిలో ఉంటే మూత్రప్రవాహం ద్వారా వెలుపలకు మూత్రంతో సహా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి ఆకారం పెద్దగా తయారైతే మూత్రమార్గాన్ని అడ్డగించి తదనుగుణమైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి పెద్ద రేగు కాయంత పరిమాణం వరకూ తయారయ్యే అవకాశం ఉంది. ఇవి చూడ్డానికి నునుపుగాగాని లేక గగ్గురుగా గాని ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. రాళ్లు ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే తయారీ తరువాత స్వస్థానంలోనే కాకుండా మూత్రమార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు.
  •  
పరీక్షలు

1.
అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు
2.
.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
3. ‘X’
రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
4.
యమ్.ఆర్. (MRI) కడుపు/మూత్రపిండాలు
5.
మూత్ర పరీక్షలు

పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.

నివారణ
రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.
కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.
ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.
ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.
విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.
మద్యం అలవాటు ఉంటే మానేయాలి.

గృహ చికిత్సలు
*
పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*
పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*
కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*
దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*
పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*
కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*
దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*
బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*
పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*
మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*
చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి


చికిత్స

1.
మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం
ద్వారా వెలుపలకు వస్తుంది

2.
శస్త్రచికిత్స :
కొన్ని మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకుని, రాళ్ళను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల పాటు ఆస్పత్రిలో వుండాలి. ఆరు నుండి పన్నెండు వారాల విశ్రాంతి అవసరం. తరువాత మూత్రపిండంలో రాళ్లు తయారవకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
3.
ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది
4.
యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, లితోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును

ఔషధాలు
నొప్పి తగ్గడానికి :
అవసరాన్ని బట్టి నొప్పితగ్గడానికి ఇంజక్షన్లు , మాత్రలు తీసుకోవాలి . Tramadal , Fortwin , Morphin -injections ... , Urispas , Drotin-M , colinol-M మున్నగు Tablets వాడ వచ్చును .
దీర్ఘకాలము ఉన్న ప్రోబ్లం అయితే ..
Cystone 2 tabs 3 times daily for 4-6 weeks ,
Urispas 1 tab 3 times daily for 2-3 weeks
Alakaline citrate liquid 5ml in 30 ml water 3 times /day

ఇఎస్డబ్ల్యుఎల్‌ : ఇది జర్మనీ రూపొందించిన యంత్రం. దీని ద్వారా రోగిని ఒక నీటితొట్టిలో పడుకోబెడ్తారు. మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములును పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లుగా మార్చవచ్చును. మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వాడినవాటిని మూత్రము ద్వారా బయటకు పంపవచ్చు. దీనికి మూడు రోజులు పడుతుంది. ఇలా కత్తితో పనిలేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు.

  • ====================

1 comment:

  1. sir manchi samachaarmu andhichaaru

    inkaa manchi samachaaramu andhinchandi pls

    ReplyDelete

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF