హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )
Knee-Pains , మోకాలి నొప్పులు.
సాధారణంగా 40 ఏళ్ళు పైబడిన వారిలో వచ్చే మోకాలి నొప్పి తాత్కాలిక ఉపశమనం కోసం వినియోగించే పెయిన్ కిల్లర్లు మరిన్ని వ్యాధులకు కారణం అవుతున్నాయి. 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే మోకాలి నొప్పి నివారణకు ప్రధానంగా పెయిన్ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండా మందుల షాపుల్లో అడిగి కొనుక్కోవడం, వాటిని వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స అధికం అవుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. మోకాలి నొప్పి సాధారణంగా సంబంధిత జాయింట్ల కింద ఉన్న ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, అరిగిపోవటం లేదా తీవ్ర గాయాలపాలయిన అనంతరం కూడా ఇవి ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దేశ జనాభాలో 15 మిలియన్ల మంది ఈ మోకాలి నొప్పి, ఊబకాయం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు. వీటికి తోడు ప్రమాదాల్లో గాయపడటం, స్థూలకాయం జీవన శైలి వంటి వాటితో నొప్పి తీవ్రతరం అయి కనీసం కూర్చోలేని, నిలుచోలేని పరిస్థితికి రోగులు చేరుతుంటారు. తాత్కాలిక పెయిన్ కిల్లర్స్ వీడితే ఇటువంటి వారికి ‘విస్కో సప్లిమెంటేషన్’ పేరిట కొత్త చికిత్సా విధానం అమలులోకి తీసుకు వస్తున్నారు.
మోకాలి నొప్పులకు విస్కోసప్లిమెంటేషన్
మోకాలి నొప్పులకు విస్కోసప్లిమెంటేషన్
దీని ప్రకారం మోకాలి చిప్పలోపలి భాగంలో చెడిపోయిన ఫ్లూయిడ్ను మొత్తం తొలగించి తిరిగి అదే విధమైన కొత్త లిక్విడ్ను ఎక్కిస్తారు. దీనితో పాటు సంకోచ, వ్యాకోచ స్థితిగతులను నిత్యం వైద్యులు పరిశీలించడం వలన కొత్తగా ప్రకృతి తయారీ ఫ్లూయిడ్లను జొప్పించిన కారణంగా నొప్పి తగ్గి నడిచేందుకు వీలు ఏర్పడుతుందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకే ఒక్క ఇంజెక్షన్తో దాదాపు ఆరు నెలల పాటు నొప్పిని తగ్గించుకునే అవకాశం ఉందని తేలింది. ఇంజెక్షన్ ద్వారా మోకాలి జాయింట్ వద్దకు పంపించే ఈ విధానంలో ఆరు నెలల పాటు చికిత్స పొందాల్సి ఉంటుంది. దీనికి తోడు క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణలతో మోకాలి నొప్పులను నియంత్రించుకోవచ్చని అపోలో సర్జెన్ డా కార్తీక్ సింగ్లే పేర్కొన్నారు. స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్ల వినియోగం కేవలం తాత్కాలిక ఉపశమనమేనని, దీర్ఘ కాలిక ఉపశమనం రావాలంటే ఈ కొత్త విధానం చికిత్స తీసుకోవడం ఉత్తమం అన్నారు.
పైగా పెయిన్ కిల్లర్ల విచ్చలవిడి వినియోగం వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కిమ్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డా ఐ.వి. రెడ్డి అన్నారు. స్థూలకాయానికి, మొకాలి నొప్పి సమస్యకు దగ్గర సంబంధం ఉంటుంది. అత్యధిక బరువు మోకాలిపైనే మోపడం, వయస్సు పై బడుతున్న కొద్దీ ఎదురయ్యే దుష్ఫలితాలు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్కు కారణం అవుతున్నట్లు వైద్యుల పరిశోధనలు తేట తెల్లం చేస్తున్నాయి. మొత్తం మీద రోజుకు 30 నిమిషాల పాటు నడక లేదా వారానికి ఐదు సార్లు చిన్న పాటి వ్యాయామం, క్రమం తప్పని పౌష్టికాహారం వంటివి మోకాలి నొప్పులకు రోగులు తీసుకోవల్సిన ప్రాథమిక జాగ్రత్తలని చెప్పక తప్పదు. నగరంలో ఈ తరహా కొత్త వైద్య విధానంతో అత్యధిక సంఖ్యలో రోగులకు విస్కో సప్లిమెంటేషన్ ద్వారా నయం చేయగలుగుతున్నారు.

No comments:
Post a Comment