Total Pageviews

Wednesday, August 24, 2011

డిగ్రీతో దారులెన్నో...


హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
 
డిగ్రీతో దారులెన్నో...
బీఏ, బీకాం, బీఎస్సీ...పరిచయం అవసరం లేని కోర్సులు. ప్రొఫెషనల్ కోర్సులకు దీటుగా, కొత్త కోర్సులకు తీసిపోకుండా తమ ప్రాభవాన్ని కోల్పోకుండా దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

డిగ్రీ అర్హతతో కళ్లు చెదిరే ఉద్యోగాలు, ఉన్నత చదువులు ఎన్నో ఉన్నాయి. క్లర్క్, క్యాషియర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నింటికీ డిగ్రీ ఉంటే చాలు. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రణాళిక రచించుకుంటే డిగ్రీ పూర్తయ్యేలోపు లక్ష్యాన్ని అందుకోవడం తేలికే.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు సెక్టార్‌లో లక్షలాది ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వోద్యోగాల నియామకాలు బాగా పెరిగాయి. రైల్వేల్లోనూ నియామకాల జోరు ఊపందుకుంది. ఈ పరిణామాలన్నీ డిగ్రీ చదువుతున్న యువతకు ఎంతో మేలు చేసేవే. ఎందుకంటే ఈ రంగాల్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు డిగ్రీ అర్హతతోనే ఉన్నాయి. ఉద్యోగాలకు కల్పతరువులైన సివిల్స్, గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, డీఎస్సీ...ఇవన్నీ సాధించాలంటే కావాల్సిన అర్హత ఎనీ డిగ్రీ.

పాపులర్ డిగ్రీ కోర్సులు

బీఏ: హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, సైకాలజీ...

బీఎస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ...

బీకాం: కంప్యూటర్ అప్లికేషన్స్, రెగ్యులర్, ఎకౌంటింగ్, ట్యాక్సేషన్

ఇవేకాకుండా బీబీఏ, బీసీఏ, బీబీఎం...లాంటి విభిన్న డిగ్రీ కోర్సుల్లో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ చదువుతూ సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్‌లాంటి ప్రొఫెషనల్ కోర్సులు కూడా పూర్తిచేయొచ్చు.

డిగ్రీ తర్వాత పీజీ చేస్తే...

పీజీ కోర్సులు చదివిన వాళ్లకు అవకాశాలు ఆకాశమంత. ప్రైవేటు రంగాలు, బహుళ జాతి సంస్థలు పెరిగాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఫార్మా, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఫైనాన్స్...అన్ని విభాగాల్లోనూ పీజీ విద్యార్థులకు ఉద్యోగాలు మెండుగా ఉన్నాయి. పరిశోధనల్లోనూ అవకాశాలు పెరిగాయి. యూజీసీ, సీఎస్‌ఐఆర్‌లే కాకుండా ప్రైవేటు రంగ సంస్థలు కూడా పరిశోధకులకు స్కాలర్‌షిప్పులతో ప్రోత్సాహలందిస్తున్నాయి. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ...ఇలా ప్రతి కోర్సుకూ గిరాకీ ఏర్పడింది. ఈ కోర్సులు చదివిన వాళ్లకు ప్రైవేటు, బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతాయి. కాబట్టి డిగ్రీ తర్వాత పీజీ చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటోంది.

ఎంఎస్సీ: రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ సెట్‌ల ద్వారా ఎంఎస్సీలో అడ్మిషన్ లభిస్తుంది. రెండేళ్ల ఎంఎస్సీ పూర్తయ్యాక టీచింగ్, లేదా రీసెర్చ్ రంగంవైపు మళ్లవచ్చు. పీహెచ్‌డీ పూర్తిచేస్తే ఈ రెండురంగాల్లోనూ అత్యున్నతంగా రాణించవచ్చు.
బీఈడీ: బీఎస్సీ విద్యార్థులు టీచింగ్‌లో ప్రవేశించాలంటే... బీఈడీ చేయడం ఉత్తమ మార్గం. ఇది ఏడాది కోర్సు. దీన్ని పూర్తిచేసుకున్నాక డీఎస్సీ రాసి ఎస్‌జీ టీ, స్కూల్ అసిస్టెంట్‌లుగా స్థిరపడొచ్చు.

మీడియా, మాస్ కమ్యూనికేషన్: డిగ్రీ పూర్తయ్యాక మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను భారీ జీతాలతో సొంతం చేసుకోవచ్చు.

కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులకు

డిగ్రీలో బీకాం పూర్తిచేసిన వారికి వివిధ రకాల కోర్సులు ఆహ్వానం పలుకుతున్నారుు. పీజీలో ఎంకాం కోర్సును చేయవచ్చు. సంప్రదాయ ఎంకాంతోపాటు పలు యూనివర్సిటీలు జాబ్ ఓరియెంటెడ్ ఎంకాం కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఎంకాం

బీకాం తర్వాత సంప్రదాయ ఎంకాం కోర్సును పూర్తి చేయొచ్చు. ఎంకాంలో ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్, టాక్సేషన్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడానికి వీలుంది. మన రాష్ట్రంలోని యూనివర్సిటీలు పీజీ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా ఎంకాంలో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.

జాబ్ ఓరియెంటెడ్ ఎంకాం

జాబ్ మార్కెట్‌లో కొత్త పోకడల నేపథ్యంలో... కొన్ని యూనివర్సిటీలు ఎంకాంలో వినూత్న కోర్సులను అందిస్తున్నాయి. ఎంకాం కార్పొరేట్ సెక్రటరీషిప్ ఆంధ్రాయూనివర్సిటీ; ఎంకాం ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను ఉస్మానియా యూనివర్సి టీ; ఎంకాం ఫైనాన్స్ అండ్ కంట్రోల్ కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ; ఎంకాం ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆంధ్రా యూనివర్సిటీ; మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనే జ్‌మెంట్ కోర్సును ఎస్‌వీ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నాయి. ద్రవిడియన్ విశ్వవిద్యాలయం (కుప్పం) ఐదేళ్ల ఎంకాం (కంప్యూటర్స్) ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తోంది.

ఎమ్మెస్సీ ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్

భారతియార్ వర్సిటీ అందించే ఈ కోర్సుకు కామర్స్ గ్రాడ్యు యేట్లు అర్హులు. వివరాలకు www.b-u.ac.in చూడొచ్చు.

‘లా’ కోర్సులు:లా.. ఇప్పుడు విద్యార్థుల క్రేజీ కోర్సుగా మారుతోంది. బహు ముఖ అవకాశాలు కల్పిస్తుండటం.. మన దగ్గర అంత ర్జాతీయ స్థారుు ప్రమాణాలతో.. నేషనల్ ‘లా’ స్కూల్, నల్సార్ వంటి లా స్కూల్స్ ఏర్పాటవడం అందుకు ప్రధాన కారణాలు. ప్రవేశ పరీక్షల ద్వారా ‘లా’ కోర్సులో అడ్మిషన్ పొందాల్సి ఉంటుది. వున రాష్ట్రంలో లాసెట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. జాతీయ స్థారుులోని ప్రముఖ ‘లా’ స్కూల్స్‌లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సీఎల్‌ఏటీ- క్లాట్) ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు!!

ఐఐటీ

ఒకప్పుడు ఐఐటీల్లో కేవలం టెక్నికల్ కోర్సులైన బీటెక్, ఎంటెక్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎంబీఏ, ఎంఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సులు చేరాయి. ఇప్పుడు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లాంటి ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కోర్సులనూ కొన్ని ఐఐటీలు అందిస్తున్నాయి.

ఎనీ డిగ్రీతో ఇవీ కోర్సెస్...

పీజీ కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీల్లో అభిరుచి బట్టి కనీసం 100 కోర్సులు గ్రూపుల వారీ లభ్యం. ఈ కోర్సులు స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీల్లో ఉంటాయి.

ప్రొఫెషనల్ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, బ్యాచిలర్ ఆఫ్ లా, బీ.ఎడ్

అకడమిక్ పరీక్షలు: యూనివర్సిటీ పీజీ సెట్స్(స్టేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు విడిగా దేనికదే నిర్వహించేవి) ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జామ్. ఐసెట్, మ్యాట్, క్యాట్, జేమెట్, ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్ ...ఇలా పలు రకాల పరీక్షల ద్వారా డిగ్రీ తర్వాత పీజీలో చేరొచ్చు.

విభిన్న కోర్సులూ ఉన్నాయి....

ప్రత్యేక విషయంలో అభిరుచి ఉన్నవాళ్లకోసం జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థలు వెలిశాయి. అందులో కేవలం సంబంధిత విభాగంలో కోర్సు మాత్రమే ఉంటుంది. ఆ సంస్థల్లో కోర్సులు చేసిన వారికి ప్రత్యేక గుర్తింపూ ఉంది. అలాంటి వాటిలో ముఖ్యమైనవి... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఈ సంస్థ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సును అందిస్తోంది. ఫారెస్ట్రీ, డెయిరీ టెక్నాలజీ, ఇన్సూరెన్స్...ఇలా విభాగాల వారీ జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థలున్నాయి.

ఎనీ డిగ్రీతో ఇవీ జాబ్స్...

కేంద్రంలో...

యూపీఎస్‌సీ ద్వారా: సివిల్ సర్వీసెస్, సీడీఎస్, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్),
ఎస్‌ఎస్‌సీ ద్వారా: కంబైన్డ్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ ఎగ్జామ్, ట్యాక్స్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్, సెక్షన్ ఆఫీసర్ (కమర్షియల్ ఆడిట్), సబ్‌ఇన్‌స్పెక్టర్స్ (సీపీఓ), సెక్షన్ ఆఫీసర్ (ఆడిట్) సెక్షన్ ఆఫీసర్ (అకౌంట్స్)

రైల్వే బోర్డులు: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్‌గార్డ్, కమర్షియల్ క్లర్క్, సూపర్వైజర్స్, రిజర్వేషన్ కం ఎంక్వెయిరీ క్లర్క్,బ్యాంకులు: క్లర్క్‌లు, పీవోలు, మేనేజ్‌మెంట్ ట్రైనీలు,
ఎయిర్ ఫోర్స్: గ్రౌండ్ డ్యూటీలో అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్, లాజిస్టిక్ విభాగాలు
ఎల్‌ఐసీ: డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (డీఓస్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏఏఓస్)
జీఐసీ: డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (డీఓస్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏఏఓస్)

రాష్ట్రంలో...

ఏపీపీఎస్‌సీ: గ్రూప్-1, గ్రూప్-2, సబ్‌ఇన్‌స్పెక్టర్లు,

దారులివీ...

డిగ్రీ తర్వాత రెండు దారులుంటాయి. అవి ఉద్యోగం, పై చదువులు. ఉద్యోగంలోనూ... ప్రభుత్వోద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వోద్యోగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. ఉన్నత చదువుల విషయానికొస్తే పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు ముఖ్యమైనవి. పీజీ కోర్సులకు సంబంధిత యూనివర్సిటీ పీజీ సెట్ నిర్వహిస్తుంది. ప్రొఫెషనల్ కోర్సులకు సంయుక్త ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు ఐసెట్, క్యాట్ లాంటి పరీక్షలు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ చేయడానికి చేరాలనుకుంటున్న యూనివర్సిటీ పీజీ సెట్ రాయాలి. సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఆ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాలి. మన రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉంది. ఐఐటీల్లో పీజీ కోసం ఐఐటీలన్నీ సంయుక్తంగా నిర్వహించే జామ్ (జాయింట్ అడ్మిషన్ టు ఎమ్మెస్సీ) పరీక్ష రాయాలి.

ఏం చేయాలంటే...

లక్ష్యం-అకడమిక్స్: డిగ్రీ తర్వాత మీ లక్ష్యం అకడమిక్ అయితే డిగ్రీ సబ్జెక్టులు చదువుకుంటే సరిపోతుంది. అంటే బీఏ విద్యార్థి లక్ష్యం ఎంఏ-ఎకనామిక్స్, బీకాం విద్యార్థి లక్ష్యం ఎంకాం, బీఎస్సీ విద్యార్థి లక్ష్యం ఎమ్మెస్సీ కెమిస్ట్రీలుగా ఉంటే అకడమిక్ పుస్తకాలపై ముందు పూర్తి పట్టు సాధించాలి. ఆ తర్వాత సంబంధిత సబ్జెక్టులో చేరాలనుకుంటున్న యూని వర్సిటీ పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి.

లక్ష్యం-ప్రొఫెషనల్ కోర్సెస్

ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు మీ లక్ష్యమైతే డిగ్రీ చదువుతూ వీటి కోసం కసరత్తు ప్రారంభించాలి. ఎందుకంటే ఈ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు అకడమిక్స్‌కు ఏమాత్రం పొంతన ఉండదు. అకడమిక్ సబ్జెక్టులను పక్కన పెట్టేయకుండా వీటి ప్రిపరేషన్ సాగాలి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ ప్రామాణిక పుస్తకాలు చదవొచ్చు. ఆఖరు సంవత్సరంలో మంచి కోచింగ్ సెంటర్‌లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సులకు మంచి కమ్యూనికేషన్ (రిటన్ అండ్ స్పోకెన్) తప్పనిసరి కాబట్టి ఇంగ్లిష్ పరిజ్ఞానం అనివార్యం. ప్రయత్నం చేస్తే ఇది సులువైన పనే.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF