Total Pageviews

Thursday, August 25, 2011

పొగ తాగడం వలన వచ్చే అనారోగ్యము , Health hezards of Smoking

హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )

పొగ తాగడం వలన వచ్చే అనారోగ్యము , Health hezards of Smoking

  • పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చినది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం పొగాకు వినియోగం రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది.

అయితే వినియోగించిన విధానాన్ని,
  • పొగ త్రాగడం -- చుట్ట , బీడీ , సిగరెట్ ,
  • ముక్కు పొడి రూపంలో పీల్చడం -- నశ్యము ,
  • నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
  • గుడాకు --ఒక రకము పొగాకు ఉత్పత్తి ,
  • జర్దా --ఒక రకము పొగాకు ఉత్పత్తి,
  • పాన్ పరాగ్ --ఒక రకము పొగాకు ఉత్పత్తి,

పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి
  • ఊపిరితిత్తుల కాన్సర్
  • టి.బి .
  • గుండె వ్యాధులు.-గుండె పోటు ,
  • నోటి కాన్సర్ ,
  • -బ్రోన్కైటిస్ -bronchitis ,
  • ఉబ్బసము -Asthma ,
  • ఏమ్ఫసిమ-Emphesema ,
  • రక్త నాళాల వ్యాధులు ,

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. 20 శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.. అమెరికాలోని వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉన్నది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.
  • పొగ తాగడం వలన కాన్సర్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. ధూమపానం ఆపటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 ను వరల్డ్ నో టుబాకో డే గా ప్రకటించింది. 2010 నాటికి మనదేశంలో ధూమపానం వల్ల మరణించేవారి సంఖ్య ఒక ఏడాదికి అక్షరాలా 10 లక్షలకు చేరుకుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ హెచ్చరించింది. సిగరెట్ తాగుతున్న పొగరాయుళ్ల ఆయుష్షు సుమారుగా పదేళ్లు తగ్గుతుందని వైద్యులు వెల్లడించారు. 39-69 ఏళ్ల నడుమ మరణిస్తున్న ధూమపాన ప్రియుల్లో 38 శాతం టి.బి, 32 శాతం క్యాన్సర్, 20 శాతం మందికి రక్తనాళాల సమస్యలు కారణమని పరిశోధనలో తేలింది. మనదేశంలో ఒక కోటీ 20 లక్షల మంది పొగరాయుళ్లు ఉన్నారు.
ధూమపానానికి టీకా పొగ!
ఒక్కసారి అలవాటైతే జీవితాంతం అంటుకుపోయే దురలవాటు ధూమపానం. దీన్ని మానేయడానికి ఇప్పుడు మార్కెట్లో నికోటిన్ ప్యాచ్లూ గమ్లూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ దీటుగా మద్యపానానికి పొగపెట్టే టీకానొకదాన్ని తయారుచేసిందో మందుల తయారీసంస్థ. టీకా పేరు నిక్వాక్స్(NicVAX). సాధారణంగా సిగరెట్ తాగినప్పుడు శరీరంలోకి ప్రవేశించే నికోటిన్ మెదడుకు చేరుతుంది. క్రమంగా మెదడు నికోటిన్కి బానిసవుతుంది. అదే టీకా వేయడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ నికోటిన్ను వ్యతిరేకించే యాంటీబాడీలను తయారు చేస్తుంది. నికోటిన్ శరీరంలోకి ప్రవేశించగానే యాంటీబాడీలు అప్రమత్తమై రేణువులకు అతుక్కుపోయి వాటిని మెదడుకు చేరకుండా చేస్తాయి. దాంతో సిగరెట్ తాగడం వల్ల కలిగే ఆనందం ధూమపానప్రియులకు కలగదు. ఒక్కో సిగరెట్ తాగే విరామ సమయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చి చివరకు మానేస్తారు. పొగతాగే అలవాటుకు పొగపెట్టే వ్యాక్సిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసి విపణిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది ప్రముఖ ఫార్మాకంపెనీ గ్లాక్సోస్మిత్క్త్లెన్.

పొగతాగే అలవాటు--అపోహలు

మనదేశంలో పొగతాగే అలవాటు రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యువకుల్లో సిగరెట్లు కాల్చే ధోరణి విజృంభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పొగతాగటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటితో పాటు వూపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. అయినా ఎంతోమంది 'పొగ'కు బానిసలు అవుతూనే ఉన్నారు. పొగతాగటం, సిగరెట్లపై నెలకొన్న అపోహలు కూడా పరిస్థితికి దోహదం చేస్తున్నాయి. అసలు అపోహల్లో నిజమెంత?
* పొగ తాగితే మూడ్ బాగుంటుంది.
*
ఇది పూర్తిగా తాత్కాలిక భావన. అప్పటికే కుంగుబాటు బారిన పడినవారు సిగరెట్లు తాగితే పరిస్థితి మరింత ముదురుతుండటమే ఇందుకు నిదర్శనం. పొగతో అతిగా స్పందించటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలూ పొడసూపుతాయి. రోజూ సిగరెట్లు తాగే యువకుల్లో కుంగుబాటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది.

*
అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్లు తాగుతాను. కావాలంటే ఎప్పుడైనా అలవాటును మానగలను.
*
సిగరెట్లు తాగేవారు అందులోని నికోటిన్కు బానిసలయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాలుస్తున్న కొద్దీ శరీరం నికోటిన్మీద ఆధారపడడం ఆరంభిస్తుంది. కాబట్టి దీన్నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. రోజుకి మూడు సిగరెట్లు కాల్చినా గుండెజబ్బుల ముప్పును కొని తెచ్చుకుంటున్నట్టే. ముఖ్యంగా మహిళలకు ప్రమాదం ఎక్కువ.

*
చాలాకాలంగా సిగరెట్లు కాలుస్తుంటేనే ప్రమాదం.
*
ఇది పూర్తిగా అపోహే. మొదటి సిగరెట్కాల్చటం దగ్గర్నుంచే శరీరంలోని కణాలు దెబ్బతినటం మొదలవుతుంది.

*
పొగతాగితే కేవలం వృద్ధులకే ప్రమాదం.
*
పొగ తాగితే ఎవరికైనా ముప్పు తప్పదు. దీంతో వూపిరితిత్తుల పనితీరు దెబ్బతినటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, దగ్గు, త్వరగా అలసిపోవటం వంటివి దాడి చేస్తాయి. వాసన, రుచి తెలియకపోవటంతో పాటు చర్మం కూడా త్వరగా ముడతలు పడుతుంది.

*
పొగ తాగటం మానేస్తే బరువు పెరుగుతారు.
*
ఇది అపోహ. నిజానికి పొగ మానటంతో ఆకలి పెరుగుతుంది. దీంతో తిండి ఎక్కువ తినటానికి ఇష్టపడతారు. అందువల్ల పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకర ఆహారం ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయటం వంటివి చేస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

*
కేవలం పొగతాగే అలవాటు గలవారికి మాత్రమే వూపిరితిత్తుల క్యాన్సర్వస్తుంది.
*
పొగతాగేవారికి వూపిరితిత్తుల క్యాన్సర్వచ్చే అవకాశం చాలా ఎక్కువే అయినప్పటికీ.. ఇతరులు వదిలిన పొగను పీల్చే వారికీ ముప్పు పొంచి ఉంటుంది. రేడియేషన్‌, విషతుల్యమైన పారిశ్రామిక వ్యర్థాలు, వాతావరణ కాలుష్యం, క్షయ కూడా వూపిరితిత్తుల క్యాన్సర్కు దోహదం చేస్తాయి.

*
జీవితాంతం పొగ తాగినా నా తల్లిదండ్రులకు క్యాన్సర్రాలేదు. కాబట్టి సిగరెట్లు కాల్చినా నాకు రాదు.
*
ఇలా అనుకోవటం పొరపాటు. వారికి రాలేదంటే మీకూ రాదని అర్థం కాదు. వూపిరితిత్తుల క్యాన్సర్బాధితుల్లో 90 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొగ పీల్చినవారే! చాలాకాలంగా పొగ తాగుతుండటం, ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాలుస్తుండటం వంటివన్నీ ముప్పును పెంచేవే.

*
పైప్‌, చుట్టలు వూపిరితిత్తుల క్యాన్సర్కు దారి తీయవు.
*
వీటితో వూపిరితిత్తుల క్యాన్సర్మాత్రమే కాదు.. గొంతు, నోరు, అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదమూ ఉంది. చుట్టలతో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

* '
లైట్‌' సిగరెట్లు మిగతావాటికన్నా మంచివి.
*
అన్ని సిగరెట్ల మాదిరిగానే ఇవీ ప్రమాదకరమైనవే. మెంథాల్సిగరెట్లు కూడా సురక్షితమైనవి కావు. మెంథాల్సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి మాత్రమే కాదు, వీటి అలవాటును మానుకోవటం అంత తేలిక కాదనీ పరిశోధనల్లో తేలింది. వీటిల్లోని చల్లదనం మూలంగా పొగను మరింత లోనికి పీల్చుకునేలా చేస్తుంది.


స్మోకింగ్తో సమస్మలెన్నో,smoking problesms(--డా బి.శ్యామ్సుందర్రాజ్‌,ఎం.డి., డిఎమ్‌ (పి.జి..) డి.ఎన్‌.బి,.పల్మనాలజిస్ట్‌,ఫోన్‌:040- 24744580/ 24735905

సరదా సరదా సిగరెట్టు.. అంటూ సరదాగా మొదలు పెట్టే స్మోకింగ్ఎన్నో రుగ్మతలకు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు మూలకారణంగా ఉంటున్నది. చాలామంది వ్యాధులు మొదలయ్యే వరకు స్మోకింగ్చేస్తూ తరువాత దానిని ఎలా వదిలెయ్యాలో తెలియక తికమక పడుతుంటారు. తరచుగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు క్రానిక్బ్రాంకైటిస్‌, న్యుమోనియా, లంగ్కేన్సరు పొగతాగని వారికన్నా పొగ తాగేవారిలో ఎన్నోరెట్లు ఎక్కువ. లంగ్కేన్సరు కనిపించే వారిలో 90 శాతం పైగా స్మోకర్స్కావడం గమనార్హం.మొత్తానికి నాన్‌- స్మోక ర్స్కన్నా స్మోకర్స్లో లంగ్క్యాన్సర్‌ 8-20 రెట్లు అధికం. స్మోకింగ్మానేసిన వారిలో రిస్క్‌ 2-3 రెట్లు మాత్రమే. అది కూడా 10 సంవత్సరాల తర్వాతే!

స్మోకింగ్చేసేవారు బీడి, సిగరెట్‌, సిగార్‌, చుట్ట, రివర్స్చుట్ట, హుక్కా ఇలా వేర్వేరు విధాలుగా పొగను పీలుస్తారు. దీంట్లో టార్అని పార్టిక్యులేట్మాటరు, నికోటిన్‌, కార్బన్మోనాకై్సడ్అనేవి గాస్రూపంలో పదార్ధాలుం టాయి. టార్లో ఉండే ఆర్గానిక్కాంపౌండ్లు, రేడియమ్‌, ఆస్బెస్టాస్‌, నికెల్‌, క్రోమియం వంటి పదార్ధాలు కేన్సరు కారకాలు. నికొటిన్లో అడిక్షన్చేసే గు ణం ఉంటుంది. పోతే కార్బన్మోనాకై్సడ్రక్తంలో ఆక్సి హిమోగ్లోబిన్శాతా న్ని తగ్గిస్తుంది. వీటన్నిటినీ పొగ ద్వారా పీల్చుతారు కాబట్టి శ్వాసకోశ వ్యాధులు వీరిలో ఎక్కువగా వస్తుంటాయి. ఇవే కాకుండా హై బి.పి., అసిడిటీ, పెరాలసిస్‌, హార్ట్ఎటాక్‌, బర్జర్స్డిసీజ్‌, అంగస్థంభన సమస్యలు కూడా వస్తాయి.

వివిధఅవయవాలు, ల్యారింక్స్‌, ట్రేకియా, బ్రాంకస్‌, ఆహార నాళం, జీర్ణకోశం, పెద్ద పేగు, ఓరల్కేవిటీస్కు వచ్చే కేన్సర్లు. పొగ, పొగాకు ఉత్పత్తులకు సంబం ధించినవే. గర్భిణీ స్ర్తీలల్లో పొగ త్రాగడం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, అబార్షన్‌, ప్రిమెచ్యూర్డెలివరీ వస్తాయి. బిడ్డ ఊపిరితిత్తులు సరిగా పెరగవు. ఇలాంటి పిల్లల్లో తరచూ శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. పొగ తాగడం వలన శ్వాసకోశాల కెపాసిటీ తగ్గుతుంది. కనీసం 30-80 ఎమ్‌.ఎల్‌. ఏడాదికి వీరిలో ఫోర్స్డ్ఎక్స్పిరేటరీ వాల్యూమ్తగ్గుతుంది. శ్వాస నాళాలు, చుట్టూ ఉండే లంగ్పేరంకైమా బిగుతు తగ్గిపోవడం వలన సి..పి.డి.- క్రానిక్అబ్స్ట్రక్టివ్పల్మనరి డిసీజ్వస్తుంది. వీరిలో తరచు దగ్గు కఫం, ఎడతెరపి లేని ఆయాస ఉంటాయి. రాను రాను లంగ్స్‌, హార్ట్కూడా ఫెయిల్కావచ్చు. ఒకరి పొగను ఇంకొకరు పీల్చడం వల్ల కూడా రుగ్మతలు వస్తాయి. పొగాకు ఉత్పత్తులు వాడటం మూలాన ప్రతి ఎనిమిది సెకండ్లకు ఒకరు మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.


  • ========================================================

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF