Total Pageviews

Wednesday, August 24, 2011

Suicidal tendency and prevention Hints , ఆత్మహత్యాయత్నాలు-నివారణ సూచనలు



 హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )

ఆవేశము తొనే అఘాయిత్యాలు . తొందరపాటుతో ఆత్మహత్యాయత్నాలు . చిన్నపాటి కారణాలకే మనస్తాపాలు . ఇవన్నీమనిషి మానసిక పరిపక్వత , పరిసరప్రభావము , జీవితములో జయాపజయాలు మీద ఆదారపడి జరుగుతూ ఉంటాయి . ఉదా:
  • అడిగిన వెంటనే వేడి వేడిగా బజ్జీలు ఇవ్వలేదని హొటల్ యజమాని ముక్కు వేలి కొరికాడో యువకుడు . సంఘటనకు ముందుగాని , తర్వాత గాని యువకుడి ప్రవర్తననో నేరచరిత్ర కనిపించలేదు .
  • ఇంటర్మీడియట్ లో 94 శాతము మార్కులు సాధించి ఇంజినీరింగ్ మొదటి సమ్వత్సరము లో కూడా మంచి విద్యార్ధి అనిపించుకున్న ఒక యువకుడు రెండో ఏట కొన్ని సబ్జెక్టులు తప్పడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు .
  • ప్రభుత్వ డిగ్రీ కళాశలలో చదువుతున్న విద్యార్ధిని రూ.500/- పోయినందుకు మనస్థాపముతో కళాశాల ఆవరణ లో బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .
  • పట్నానికి చెందిన ఒక బాలిక బాగా చదవడం లేదని తల్లి మందలించడము తో మనస్థాపానికి గురియై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చివరికి నిండు ప్రాణాలు బలి తీసుకుంది .
  • ఏడాది క్రితము గొల్లవీధికి చెందిన బాలుడు పక్కింటి మహిళను ఏదో అన్నాడని గొడవ చేయడం తో ఆత్మహత్య చేసుకున్నాడు . ... ... . ఇలా ఎన్నో లెక్కలలోనికి రానివి .
జీవితం ఎంతో విలువైనది . క్షణికావేశం లో బలవన్మరణానికి పాల్పడుతున్న వీరంతా కావాలనుకున్నప్పుడు మళ్ళీ తం ప్రాణాలను తెచ్చుకోగలరా... కేవలము క్షణికావేశం లో ఏమాత్రం ప్రాధాన్యత లేని చిన్నపాటి విషయాలకే ప్రాణము తీసుకోవాలనే ఆక్రోషాన్ని గుండెలో నింపుకొంటున్న నేటితరము వ్యవహారశైలి పై కొన్ని సూచనలు - >

పట్టణ వాసం లో పనులలో ఒత్తిడి , ఒంటరితనము , ఎడతెగిన బంధాలు , అలవాట్లు , చుట్టూఉన్న పరిస్థితులు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి . అయితే పల్లె జీవనము లో కూడా మారుతున్న ప్రమాణాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి . నిత్యం అందరితో సందడిగా ఉండే పల్లెవాతావరణం లో ఆత్మహత్యలకు పాల్పడే క్షణికావేశము యువతలో ఇటీవల కాలములో పెరుగుతుంది . తొందరపాటు నిర్ణయం నిండు ప్రాణాల్ని బలితీసుకుంటోంది . కన్నవారికి కడుపుకోత మిగుల్చుతోంది .
మారుతున్న కాలం లో పిల్లల పెంపకం లో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు , పరిసరాల ప్రభావము , మీడియా కథనాలు ఆత్మహత్య్లకు ఉత్ప్రేరకాలు గా మారుతున్నాయి . పల్లెలలో కుడా మెల్ల మెల్లగా పాకుతున్న పట్టణ జీవనశైలి , అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానము నకే పరిమితమవుతున్న నేటి యువతరం అనుబంధాలకు , ఆత్మీయతకు , జీవిత ఆస్వాదనకు దూరమవుతున్నారు . దీంతో తనకన్నా తనతోటి సమాజాన్ని , దాని విలువను గుర్తిచలేకపోతున్నారు . చిన్నతనము నుంచి గారాబముగా పెంచడం తో చిన్నపాటి విషయానికి కూడా పెద్ద అవమానం గా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .
ఆత్మహత్యలు - కారణాలు :

మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారాసూసైడ్ అంటారు. సాధారణ పరిభాషలో సూసైడల్ టెండెన్సీ అని వ్యవహరిస్తాము. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాము.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు రెండూ కూడా మానసిక వ్యాధుల విభాగంలో అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అంశాలు.

కారణాలు
మనిషి నిస్సహాయుడు కావడం, భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లడం, మానసిక వత్తిడి, తనకు లభించే మార్గాలను సరిగ్గా ఎంచుకోలేకపోవడం మొదలైన కారణాలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయి.

ఒక వ్యాధికి లేదా తీవ్ర మానసిక వత్తిడికి లోనయ్యేవారు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతారు.
సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలు, మానసిక వత్తిళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతాయి.

సాంఘిక సమస్యలలో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావడం ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి తమ స్థాయికి మించిన అప్పులు చేయడం, కనీసావసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవి చూడటం, వ్యాపారంలో నష్టపోవడం, ఆత్మీయులు మృతి చెందటం, భరించలేని స్థాయిలో అవమానాలకు గురి కావడం మానసిక వ్యాధులకు సంబంధించి డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి ముఖ్య కారణాలు.
డిప్రెషన్తో బాధపడుతున్న వారిలో 15 నుంచి 20 శాతం వరకూ ఆత్మహత్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడేవారిలో 10 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతారు. డిప్రెషన్తో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న సూచనలు ముందుగానే కనిపిస్తాయి.

ఆత్మహత్యలు చేసుకోవాని భావించే వారు ముందుగానే ఇతరులకు విషయం తెలియ జేయడం, లేదా ఉత్తరాలు రాసి ఉంచడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం మొదలైన చర్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధిగ్ర స్తుల్లో ముందుగా ఎలాంటి సూచనలు కనిపించవు. ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడుతారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో కేన్సర్‌, ఎయిడ్స్తదితర ప్రమాదకర వ్యాధులకు గురైన వారు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్ప డుతుంటారు. సాధారణంగా 40 -50 సంవ త్సరాల మధ్య వయస్కుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మహత్యాయత్నాలు స్త్రీలలో ఎక్కువగానూ, ఆత్మహత్యలు పురుషుల్లో ఎక్కువగానూ ఉంటాయి.

ఒక మనిషి ఆత్మహత్య గురించి ప్రస్తావిం చినప్పుడు కాని, ఉత్తరాల ద్వారా విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు వ్యక్తి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

ఆత్మహత్య గురించిన ఆలోచన వ్యక్తపరిచిన వ్యక్తిలో ఆలోచన ఎంత బలీయంగా ఉందో గమనించి దానినుంచి విరమించుకునేలా చేయాలి. దానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలి.

ఆత్మహత్యల గురించి ఆయా వ్యక్తులతో చర్చించడం వలన వారిని సరైన మార్గంలోకి మళ్లించడానికి వీలు కలుగుతుంది. ఏవైనా వ్యాధుల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి వ్యాధులకు సంబంధించి చికిత్స చేయడం ద్వారా ఆత్మహత్యాయత్నాలను విరమింపచేయవచ్చు.


చిన్నపాటి చిట్కాలు :
  • చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణము ఆలోచించండి ..,
  • ఇలాంటి ప్రమాదాలు చాలావరకు క్షణికావేశములోనే జరుగుతుంటాయి అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి .
  • కొద్దిసేపు మౌనము గా ఉండడం ,
  • కొన్ని నిముషాలపాటు అంకెలు లెక్కపెట్టడము ,
  • కడుపునిండా చల్లటి నీరు త్రాగడం ,
  • ఒంటరిగా ఉండ కుండా మీసమస్యను స్నేహితులతోను , తోబుట్టువులతోను , మీకు నచ్చిన వారితో పంచుకోవడం .
  • తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చేసే అకతాయి పనులకు పదే పదే .. అదేపనిగా మంలించడము , పదుగురి మధ్య విషయాలు చెప్పి అవమానించడం చేయకూడదు .
  • పిల్లలు పూర్తిగా టివి లకో , వీడియో గేములకో పరిమితమై ముభావము గా ఉంటే వారిని కాస్తా కుటుంబ వ్యవహారాల్లో బాధ్యులను చేయండి .
  • పరధ్యానము గా ఉండడము , భోజము పై ఆసక్తి చూపకపోవడం లాంటివి చేస్తుంటే వారిపట్ల జాగ్రత్తలు తీసుకొని సామాజిక పనులలో నిమగ్నమయినట్లు చేయంది .

  • ==========================================

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF