హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
- సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.
- మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.
- లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు
- ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.
- బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా
- మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి
- చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది
- కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి
- సంసార సాగరం దాటలంటే…సంస్కారముల పరివర్తన కావాలి
- కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది
- దేహ శుభ్రతతో పాటు భావ శుద్దత అత్యంత అవసరం
- ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే దొడ్డ మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం మొదలు పెడతారు. తప్పులు మాత్రం చూస్తూ ఉంటే బంధం ఎలా నిలుస్తుంది?
- పుణ్యాత్ములు దు:ఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన చేస్తారు
- ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులై అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు
No comments:
Post a Comment