Total Pageviews

Monday, September 5, 2011

3G ఫోన్సు గురి౦చి

3జీ అంటే సంక్షిప్తంగాథర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా మొబైల్ నెట్వర్కులనీ , మొబైల్ఫోన్లలనీ రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీని 2G అంటున్నారు.ఇందులో వేగాన్ని స్థాయి తర్వాత పెంచలేము. ఎక్కువగా వాయిస్ మరియు టెక్స్టు డాటాని మాత్రమే మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే 3జీ. అరచేతిలో టీవీ! సినిమాలు, పాటలు, వార్తలు, మాదిరి సైజున్న వీడియో ఫైల్స్ ఏవైనా సరే చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రానున్న కాలంలో మొబైల్ ఫోన్లోనే టివీలూ చూడగలుగుతారు. దానికి ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన డిస్ప్లే సిస్టం, అధిక డాటాని వేగంగా రిసీవ్ చేసుకోగలగటం లాంటి ఎక్కువ సౌకర్యలతో మొబైల్ ఫోన్లూ వస్తాయి. టీవీ ప్రోగ్రాములను ప్రసారం చేయడానికి ఉన్న ఛానల్స్ సిద్ధం ఔతాయి. కొత్త ఛానెల్సూ , వెబ్సైట్లూ పుట్టుకొస్తాయి. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా నెట్వర్క్లన్, ఫోన్లనీ రూపొందిస్తున్నారు.
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్లో ఆన్లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నేవీడియో కాలింగ్అని పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.
మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది. కంప్యూటర్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్తో కూడిన ఎటాచ్మెంట్లతో -మెయిల్స్ ని చిటికెలో పంపేయొచ్చు.
వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తోనూ, కొత్త వాళ్ళతోనూ ఆన్లైనగేమ్స్లాగా, ఇక వీడియో గేమ్లూ అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పోలీసు, రక్షణ వ్యవస్థలు నెట్వర్క్ ద్వారా సీసీటీవీలను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, -లెర్నింగ్, స్టాక్ఎక్స్చేంజ్, టెలీమెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు సమస్త ప్రపంచం ఇక మీ అరచేతిలోనేఅరచేతిలో వైకుఠం తెలీదు గానీ, మీ ప్రపంచం మొత్తం మీ అరచేతిలోనే!




No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF