Total Pageviews

Monday, September 5, 2011

తెలుగు జోక్స్ (Jokes in Telugu)


తెలుగు జోక్స్ (Jokes in Telugu)

నవ్వడం ఒక భోగంనవ్వించడం ఒక యోగంనవ్వలేక పోవడం ఒక రోగం.

జ్ఞాపకశక్తి

"బాబూ.. జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.

ముందుగా

"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.
"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.

మలుపులు

"ఏంటమ్మా ఇది? మీ కథల్లో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు లాంటి వాక్యాలు కనిపిస్తున్నయి?" రచయిత్రి సులోచనతో అన్నాడు ఎడిటర్.
"అదేంటి సార్.... కథల్లో ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు?" కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన.

గెడ్డం

"నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గెడ్డంగీస్తాను. మరి నువ్వురా సుధాకర్" అడిగాడు గోవిందరావు.
" నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్.
"ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?"
" కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను"

పెళ్ళికి తొందర

తనకు తొందరగా పెళ్ళి చెయ్యమని, లేకపోతే ఎవరితోనైనా లేచిపోతానని అమ్మాయి warning ఇచ్చిందండీ" విచారంగా చెప్పింది అన్నపూర్ణ.
"అప్పుడే ఏం తొందర దాని పెళ్ళికి?" ఆశ్చర్యంగా అన్నాడు సహదేవరావు.
"దానికి బట్టలుతుక్కోవడం చాలా శ్రమగా ఉందట" చెప్పింది అన్నపూర్ణ.

నిద్ర

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.

రక్షించండి

గండిపేట చెరువు దగ్గర - "రక్షించండి... రక్షించండి... మా అక్క నీళ్ళలో మునిగిపోయింది" పన్నెండేళ్ళ రవి కేకలు పెట్టాడు.
వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు.
"సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.
యువకులు తెల్లముఖాలు వేశారు.

ఉత్తరాలు

"కేవలం ఉత్తరాలు రాస్తూ బతుకుతున్నావా? నీ ఉత్తరాలు అంత విలువైనవా? మ్యాగజైన్సుకు?" కుతూహలంగా అడిగాడు ఆంజనేయులు.

"అవును. డబ్బు పంపమని మానాన్నకు రాస్తూంటాను" నిబ్బరంగా చెప్పాడు రమణ.

(దీన్నే కాస్త modernగా ...

"ఏమిటి కేవలం computer మీద బతుకుతున్నావా? బ్లాగులు వగైరా రాస్తున్నావా ఏమిటి?" కుతూహలంగా అడిగాడు రాజ్.
"అవును. డబ్బు online transfer చెయ్యమని మా Daddyకి E-mail పంపిస్తూ ఉంటాను" నిబ్బరంగా చెప్పాడు అరవింద.)

చినగదు

"సార్.... షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.

వయసు

"అబ్బ... డాక్టర్ రావు నిజంగా ధన్వంతరే. మాఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని ఒక్క దెబ్బకు పోగొట్టాడు" సంతోషంగా చెప్పాడు చిదంబరం.
"ఏం మందిచ్చాడేం?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.
"వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నడు. అంతే! మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచక చేస్తున్నది" అన్నడు చిదంబరం.

అనుభవం

"మొన్న ఒక పత్రికలో మీ కథ చదివాను. నా కంటే మీరు చిన్నవారైనా అనుభవం మాత్రం పెద్దది" తోటి రచయితతో అన్నాడు సాటి రచయిత.
"ఏం అలా అంటున్నారు?"
"ఏం లేదు. నేను ముప్పై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు ఏభై సంవత్సరాల నటి కథలు కాపీ కొడుతున్నారు." 

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF