దేశీయంగా అంతర్జాతీయంగా కూడా యానిమేషన్కు ఉజ్వల భవిత కనిపిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకువెళ్తున్న యానిమేషన్లో కెరీర్ను తీర్చిదిద్దుకోవటానికి యువత ఆసక్తిప్రదర్శిస్తోంది ! మాంద్యం వల్ల బడ్జెట్ పరిమితులు ఏర్పడ్డాయి. దీంతో పాశ్చాత్య దేశాల్లోని యానిమేషన్ అవుట్సోర్సింగ్కు మనదేశం వైపే చూస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్, ప్రాంతీయ సినిమా రూపకర్తలకు స్పెషల్ ఎఫెక్ట్‌లపై ఆసక్తి పెరుగుతుండటం వల్ల యానిమేషన్ కార్యకలాపాలపై ఉపొచ్చింది. కానీ సుశిక్షితుల కొరత ఈ రంగంలో ఎక్కువగానే ఉంది. ఈ పరిణామం యానిమేషన్ శిక్షణ సంస్థలకు ప్రాధాన్యం పెంచుతోంది. ఆసిక్తి, అభిరుచీ ఉన్న యువత ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభ్యసించడానికి శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
వికాస దశలో ఉన్న కెరీర్లో యానిమేషన్ ముఖ్యమైంది. మనదేశంలో ఈ రంగం ఆలస్యంగానే అడుగులు వేయటం ప్రారంభించింది. భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు అపార సంపద. యానిమేషన్ రంగం వీటిని ఉపయోగించుకోవటానికి విస్తృత అవకాశాలున్నాయి. యానిమేషన్ అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి ఈ కెరియర్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్, ఏరోస్పేస్, సివిల్, ఆటోమొబైల్ మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి. ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్ అసైన్మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్ క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3-డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ యానిమేటర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, 3 డీ లైటింగ్ ఆర్టిస్ట్, 3 డీ కంపోజర్, ఎఫ్ఎక్స్ ఆర్టిస్టు, విఎఫ్ఎక్స్ కంపోజర్ విఎఫ్ఎక్స్ రోటో అండ్ పెయింట్ ఆర్టిస్ట్…ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్ డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ ఆర్టిస్ట్ అవుతారు.
యానిమేషన్కు అంతర్జాతీయ వాల్ట్డిస్నీ స్టూడియోస్, సోనీ లాంటివి ప్రఖ్యాతి చెందాయి. భారతీయ యానిమేషన్ పరిశ్రమ అవుట్ సోర్సింగ్‌కు బాగా ప్రసిద్ధికెక్కింది. టాటా, రిలయన్స్, సత్యం, రిదమ్ అండ్ హ్యూమ్ లాంటి ప్రఖ్యాత ఐటీ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించాయి. భారతీయ యానిమేషన్ సంస్థలతో కలిసి పనిచేయ టానికి అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తున్నాయనేది గణనీయమైన అంశమే. కార్టూన్ క్యారెక్టర్ స్కెచింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ మొదలైన అసైన్మెంట్లు అవుట్సోర్సింగ్ కింద మనదేశానికి లభిస్తున్నాయి. ప్రస్తుత భారతీయ యానిమేషన్ కార్యకలాపాలు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్‌ఎక్స్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశముంది. దేశీయంగా ఉండే వినోద పరిశ్రమ నుంచి కూడా యానిమేషన్ సంస్థలకు గిరాకీ ఏర్పడుతుంది. మగధీర, అరుంధతి.. వంటి సినిమాల్లో విజువల్ ఎఫెక్టులు ప్రేక్షకులను ఎంతో అలరించిన సంగతి తెలిసిందే. మనదేశానికి యానిమేషన్, గేమ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు రావటంలో ఖర్చులు తగ్గటం అనేది ముఖ్యాంశమే. దాదాపు 60 శాతం ప్రొడక్షన్ ఖర్చులు కలిసొస్తాయి. దీంతోపాటు నాణ్యత, పౌరాణిక, చారిత్రక వారసత్వం, ఇంగ్లిష్ మాట్లాడే వారు అత్యధికంగా ఉండటం కూడా మనదేశానికి అనుకూలించే అంశాలు.
అర్హతలు ః- యానిమేటర్ కావాలంటే ఊహాశక్తి, పరిశీలనా శక్తి, డ్రాయింగ్ నైపుణ్యం, విజువలైజేషన్లో ప్రతిభ ఉండాలని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. కొత్తదనాన్ని ప్రదర్శించగలిగే నేర్పు ముఖ్యం. కంప్యూటర్ను కనీసం ఉపయోగించగలటం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలండటం అదనపు ప్రయోజనం.యానిమేషన్ శిక్షణలో స్వల్ప, దీర్ఘకాలిక కాలవ్యవధిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొంత ప్రాథమిక పరిజ్ఞానం ఉండి, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోదలిచినవారికి స్వల్పకాలిక కోర్సులు ఉపయోగం. వీటి వల్ల యానిమేషన్లోని డిజిటల్ డిజైనింగ్, త్రీడీ మోడలింగ్ టెక్చరింగ్, లైటింగ్లలో ప్రవేశస్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. దీర్ఘకాలిక కోర్సులకు సహజంగానే ఎక్కువ విలువ ఉంటుంది. దీర్ఘకాలిక కోర్సుల్లో అన్ని రకాల అంశాలనూ నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కదా ! ఈ కోర్సుల్లో చేరదల్చినవారు తమకు నిజంగా ఈ రంగంపై ఆసక్తి ఉందో లేదో తేల్చుకోవాలి. దీనికోసం ఈ రంగంలోని వారితో మాట్లాడటం, ఇంటర్నెట్లో పరిశ్రమ గురించి ప్రాథమికాంశాలైనా తెలుసుకోవటం..ఇవన్నీ అవసరమే.
ఎలాంటి శిక్షణ అఅవసరంః- అన్నికంటే ఉత్తమమైన పద్ధతి…ఎవరో చెప్పిందానిపైనే ఆధారపడకుండా స్వయంగా యానిమేషన్ శిక్షణ సంస్థలను సందర్శించటం. వాటికి ఉన్న ప్రఖ్యాతీ, అక్కడి మౌలిక సదుపాయాలూ, అక్కడి విద్యార్థుల ప్లేస్మెంట్ రికార్డ్ పరిశీలించటం ముఖ్యమే. అక్కడి విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో వారి ద్వారానే తెలుసుకోవాలి. ఆ తర్వాతే తుది నిర్ణయానికి రావటం మేలు.
యానిమేషన్ అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి ఈ కెరియర్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్, ఏరోస్పేస్, సివిల్, ఆటోమొబైల్ మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి.ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్ అసైన్మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్ క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, 3-డీ క్యారెక్టర్ మోడ్‌లర్, 3 డీ యానిమేటర్, టెక్చరింగ్ ఆర్టిస్ట్, 3 డీ లైటింగ్ ఆర్టిస్ట్, 3 డీ కంపోజర్, ఎఫ్ఎక్స్ ఆర్టిస్టు, విఎఫ్ఎక్స్ కంపోజర్ విఎఫ్ఎక్స్ రోటో అండ్ పెయింట్ ఆర్టిస్ట్…ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్ డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ ఆర్టిస్ట్ అవుతారు.
ఈ సమాచారము అంకుశం.కం నుండి సేకరించింది.
No comments:
Post a Comment