గల్ఫ్ యుద్ధ కాలంలో 11,000 ప్రయాణీకులను అమ్మాన్ నుండి ముంబైకు చేర్చినందుకు ఎయిర్ ఇండియా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది.
పర్షియన్ గల్ఫ్ యుద్ధం సందర్భంలో ముందు జాగ్రత్త చర్యగా కువైత్, ఇరాక్ మరియు అమ్మాన్ నుండి భారతీయ ప్రయాణీకులను 1990 ఆగస్ట్ 13 నుండి అక్టోబర్ 11 వరకు 59 రోజులపాటు 488 విమానాలు 4,117 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించి మాతృదేశానికి చేర్చిన సందర్భంలో ఈ గుర్తింపుని పొందారు.
విమానాలలో చక్కని ఆహారాన్ని అందించినందుకు 1994 నుండి 2003 వరకు 'మెర్క్యురీ అవార్డ్' ని పొందింది.
ఎయిర్ ఇండియా యునైటెడ్ నేషన్స్ నుండి పరిసరాల పరిరక్షణ విషయంలో తూసుకుంటున్న శ్రద్ధ కొరకు ప్రత్యేకంగా ఓజోన్ సంరక్షణ విషయంలో తీసుకుంటున్న శ్రద్ధకు గుర్తుగా మాంట్రియల్ పబ్లిక్ ప్రోటోకాల్ అవార్డుని పొందింది.
2006లో అవాజ్ కన్స్యూమర్ అవార్డ్ నుండి ట్రావెల్ మరియు హాస్పిటాలిటి కొరకు 'ప్రిఫర్డ్ ఇంటర్నేషనల్ అవార్డును' పొందింది.
ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ విభాగం అంతర్జాతీయ ప్రమాణంకలిగిన వసతులు కలిగి ఉన్నందుకుగాను ఐఎస్ఒ 9002 గుర్తింపుని పొందింది.
No comments:
Post a Comment