ఇంగ్లాండులో భారతీయ ఉత్సవాలుబిటిష్ హౌస్ ఆఫ్ కామన్సలో దీపావళి జరుపు కున్నారనీ, లండన్ నగరంలోని హిందువులు థేమ్స నదిలో గణేశ నిమజ్జనం జరిపారనీ వెలువడిన వార్తలు హిందువులకు ఆనందం కలిగించే విషయం అనడంలో ఆశ్చర్యంలేదు. పూణే నుంచి తెప్పించిన గణేశ విగ్రహానికి మూడు రోజుల పాటు పూజలు జరిపి, ఆ తరవాత నిమజ్జనానికి తీసుకు వెళ్ళారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన దాదాపు పదివేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇంగ్లాండు లోని హిందూ కల్చర్ అండ్ హెరిటేజ్ సొసైటీ గణేశ చతుర్థి ఉత్సవాన్ని ఏర్పాటు చేసింది. హౌస్ ఆఫ్ కామన్సలో ఒక పెద్ద హాలులో, పెద్ద పెద్ద సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రదర్శనకు ఉంచారు. పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, లార్‌డ్స, బెరోనెసస్ ఈ ఉత్సవానికి హాజరయ్యూరు. ప్రధాన మంత్రి టోనీ బ్లేయర్ తన ప్రత్యేక సందేశంలో, ‘‘బ్రిటన్ విజయూనికి భారతీయ సంతతి ప్రజానీకం చేస్తూన్న మహత్తర కృషిని గురించి ఆలోచించడానికి ఇదొక చక్కని అవకాశం మన కందరికీ కల్పిస్తున్నది,'' అన్నారు.
అంతరిక్షంలో మూడు దృగ్విషయూలను చూసిన విలక్షణ మాసం!
ఆరు వేల సంవత్సరాలకు ఒకసారి ఒక్క నెలలోపల జరిగే మూడు అంతరిక్ష అద్భుతాలు గత అక్టోబర్లో జరిగాయి. రెండు గ్రహణాలు, అంగారక గ్రహం భూమి సమీపంలోకి రావడం ఒక్క నెలవ్యవధిలోనే జరిగాయి. ఒకే చోటి నుంచి ఈ మూడు దృగ్విష యూలను వెయ్యేళ్ళకు ఏఒక్కరూ చూడలేరని అంత రిక్ష శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ సూర్య గ్రహణం, అక్టోబర్ 17న చంద్రగ్రహణం ఏర్పడడంతో పాటు
No comments:
Post a Comment