చంద్ర యాత్రికులు
మనిషిగా ఇది నాకు చిన్న అడుగే కావచ్చు. మానవ సమాజానికి మాత్రం భారీ ముందడుగు అంటూ జాబిల్లిపై అడుగు పెట్టిన తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సగర్వంగా ప్రకటించిన రోజు 1969 జూలై 20. నాటినుంచి 1972 డిసెంబర్ 11 దాకా (అపోలో 17) మొత్తం 12 మంది రోదసీ యాత్రికులు చంద్రుడిపై పాదం మోపారు. వీరు అందరూ అమెరికన్లే కావడం విశేషం.చంద్రయాత్రికుల వివరాలు
లూనార్ ల్యాండర్ 1969 జూలై 20న (అపోలో 11) నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్
ఇంట్రిపెడ్ 1969 నవంబర్ 19 (అపోలో 12) చార్లెస్ పెటే కోన్రాడ్, అలెన్ బీన్
అంటేరస్ 1971 ఫిబ్రవరి 5 (అపోలో 14) అలెన్ బి. షెపర్డ్, ఎడ్గార్ మిచెల్
పాల్కన్ 1971 జూలై 30 (అపోలో 15) డేవిడ్ స్కాట్ జేమ్స్ ఇర్విన్
ఓరియన్ 1972 ఏప్రిల్ 21 (అపోలో 16) జాన్ యంగ్, ఛార్లెస్ డ్యూక్
ఛాలెంజర్ 1972 డిసెంబర్ 11 (అపోలో 17) ఎగ్యూన్ సీమన్, హారిసన్ హెచ్.జాక్
No comments:
Post a Comment