తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.
"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.
"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.
"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్ని" చెప్పాడు దంతనాధం

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.
"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.
"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి

"సిగ్గులేదటయ్యా నీకు? కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.
"నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు
"చాల్చాల్లే నోర్ముయ్....
గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను. ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు. అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్.

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
- అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
- పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.
అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.
నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."
రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది.
దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు. ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.
తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ ఫీలింగ్ తొలగిపోగా తాపీగా చేపలు పట్టేందుకు ఉపక్రమించాడు.
కాసేపాగాక ఎవరో వెనక పొడుస్తున్నట్లు అనిపించింది. వెనక్కి చూస్తే అదే పిట్ట....
ముక్కున మరో మూడు ఎరలతో!!!!

వెంకట్రావ్ సాఫ్ట్ వేర్ నిపుణుదు. ఆయన రిజిష్టర్ చేయించిన సినిమా టాటిల్స్ ఇవీ..
- శంకరదాదా M.C.A
- చాట్టింగ్ చేద్దాం రా
- ప్రోగామర్ నెం. 1
- వైరస్ స్టోరీ
- ఎవడి సిస్టమ్ వాడిదే
- సంపూర్ణ "జావా"యణం
- హ్యాకర్లకు మునగాడు
- సాఫ్ట్ వేర్ చిన్నోడు
- హ్యాకిరి
- 80 జీబీ.... డాట్కాం కాలనీ
- ఆపరేషన బిల్ గేట్స్
- సీ ప్రోగ్రాం రహస్యాలు
- మెమరీలో ఆమె జ్ఞాపకాలు
- పాస్వార్డ్ లేని చిన్నది
నలుగు ఆడపిల్లలున్న కుటుంబరావు పండక్కి ఇంటికి సున్నం వేయించాలనుకున్నాడు. సామాను బయటకు పెడుతుంటే సోఫా కుషన కింద ఈ వస్తువులు కనబడ్డాయి.
- మూడు చిన్న దువ్వెనలు
- ముప్పై నాలుగు గుండు పిన్నులు
- ఐదు సూదులు
- రెండి చీర పిన్నులు
- ఇరవై మూడు హెయిర్ పిన్నులు
- అప్పడాల ముక్కలు
- నాలుగు తలనొప్పి మాత్రలు
- ఇరవై టూత్పిక్స్
- పదమూడు హుక్కులు
- తొమ్మిది గుండీలు
- బొట్టు బిళ్ళల ప్యాకెట్ (సగం వాడింది)
"ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్.
"అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు
"అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.
"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.
"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.
"నాకిస్తే వెయ్యి"
"నాకిస్తే రెండు వేలు..."
"నాకిస్తే నాలుగు వేలు..."
"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.

తల్లి: చిన్నీ! మీ క్లాస్లో ఎప్పుడన్నా దేనిలోనన్నా ఫస్ట్ వచ్చావా?
చిన్ని: బెల్ కొట్టగానే క్లాస్ ఏం ఖర్మ, మొత్తం స్కూల్లోనే బయటికొచ్చేయడంలో నేనేగా ప్రతిరోజూ ఫస్ట్.
తండ్రిః ఓ వ్యక్తి రోజుకు పదికిలోమీటర్ల చొప్పున నడిస్తే వారం రోజుల్లో 60 కిలోమీటర్లు ముందుకుపోతాడా? ఇదేం లెక్కరా?!
కుమారుడుః ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు నడవకుండా జాలీగా గడిపేసుంటాడని అలా చెప్పా డాడీ!!!
కస్టమర్: మీ హేరాయిల్ వాడితే నా బట్ట తల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పారు. ఒక వేళ అలా జరగకపోతే...
సేల్స్మ్యాన్: ఏడాది తర్వాత ఒక విగ్ ప్రజెంట్ చేస్తాం.
రాత్రి టీవీ సీరియల్ చూస్తూ నిద్రఆపుకోవడానికి అవస్తపడుతున్న భర్తతో, 'పగలంతా ఆఫీసులో నిద్రపోకుండా ఎవర్ని ఉద్దరించారు' అని భార్య కోపంగా అరిచింది.
భర్తః భయం, భయంగా 'పక్కసెక్షన్ మోహన్రావు బలవంతం చేస్తే పేకాట ఆడానే...!
అబ్బా.....! టైమ్ చాలా తొందరగా పరిగెత్తుతున్నది కదండీ!! యధాలాపంగా అంది మినిస్టర్ గారి భార్యామణి భర్తతో.
నిజమే! నిన్ననే నా నియోజకవర్గమంతా పర్యటించినట్లనిపిస్తోంది. అప్పుడే ఐదేళ్ళ పదవీకాలం అయిపోయిందంటే నమ్మశక్యం కావడంలేదు.... అన్నాడా మంత్రి వర్యుడు దిగాలుగా.
శ్రీపతిరావు మంచి మూడ్ లో వున్నాడు. భార్యతో సరదాగా నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది. శ్రీమతీ... ఎక్కడున్నావ్ ఇలా రావోయ్ అన్నాడు గోముగా.
సమాధానం లేదు!
భార్యామణీ, గృహలక్ష్మీ..... ఇలా రావమ్మా!! మళ్ళీ ముద్దుగా పిలిచాడు శ్రీపతిరావు.
అయినా సమాధానం లేదు!!
ఒసేయ్ గయ్యాళి గంపా....ఇటు తగలబడు అన్నాడు శ్రీపతి రావు కోపంగా!!
నన్నే పిలిచారనుకుంటా..... ఇదిగో వస్తున్నా.. ఠకీమని సమాధానం ఇచ్చింది భార్యామణి లోపలి నుంచి!!
'అబ్బ... మీరిచ్చిన ఆయింట్మెంట్ అద్భుతం డాక్టర్ గారూ! చేతికి రాసీ రాయగానే నొప్పి పోయి హుషారు వచ్చేసింది' అన్నాడు డల్గా వుండే ఓ కుర్రాడు.
'అలాగా? అయితే ఆ ఆయింట్మెంట్ను నీ బుర్రకు కూడా కాస్తా పట్టించు' అన్నాడు విసుగ్గా డాక్టర్
నువ్వెందుకోయ్ �ులటరీలో చేరావ్..... కొత్తగా జాయిన్ అయిన రమేష్ ను అడిగాడు సుధీర్.
పెళ్ళీ గిళ్ళీ కాలేదుగా సార్... అందుకే �ులటరీలో చేరిపోయా.... మరి �dురెందుకు చేరారు సార్? గడుసుగా అడిగాడు రమేష్.
ఇంట్లో పెళ్ళాం పోరు భరించలేకోయ్......!! ఠకీమని చెప్పాడు సుధీర్
తల్లిః చూడు రాణీ! పక్కింటి ప్రకాశం గాడు నీకోసం రోజు మనింటికి రావడం ఏమీ బాగాలేదు.
రాణిః ఐతే....రేపణ్నించి నేనే వాళ్ళింటికెళతాలే మమ్మీ!!
సూరిః ఒరే చందూ! మన టీచర్లు చేసేది చాలా అన్యాయం రా...!!
చందుః ఏం.....? ఎందువల్ల?!
సూరిః ఒకటి, రెండు ఇలా తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని పాస్ చేస్తూ.....నా లాగా నలభై, ఏభై ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళని ఫెయిల్ చేస్తున్నార్రా!! .....ఇది అన్యాయం కదూ....?!!!
"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.

పెళ్ళికి ముందు
రాము, సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది. ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం. వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విశాఖపట్టణంలో). ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు.
సమయం : 22:00 hrs
సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు?
రాము : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.
రాము : సరే. నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.
సీత : సరే
ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు (brittania little hearts) biscuit packet కూడా తీసుకు వచ్చాడు.
సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా?
రాము : మ్.. అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.
సీత : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను. ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.
రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.
రాము, సీత రైలు ఎక్కుతారు.
సీత : side upper side lower book చేసారా?
రాము : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.
అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. మా నిద్రను disturb చేస్తున్నారు".
సరే అని రాము, సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి, మాట్లాడుకుని వచ్చి తమ తమ berth ల లో పడుకున్నారు.
పెళ్ళైన తరువాత
పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము, సీత ప్రయాణమయ్యారు. ఇద్దరూ train ఎక్కారు.
సీత : ఏ బెర్త్??
రాము : రెండు upper berths book చేసాను (మనసులో వెధవ నస ఉండదు)
సీత : హమ్....
రాము : సరే water bottle ఇవ్వు.
సీత : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.
రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.
సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, ఆ 5 నిమిషాలు కూడా ఉండదు.
రాము : (ఛీ ఎధవ బతుకు)
రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు. (ఈ సారి నీళ్ళు మాత్రమే. చిన్ని చిన్ని గుండెలు లేవు)
train time అయ్యింది , బయలు దేరింది.
సీత (ఆవిలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.
రాము : సరే పడుకో. (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)
TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు. పక్కనే side upper ,side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు.
ఆ జంట సరేనని, మెల్లగా train తలుపు వైపు వెళ్ళి .........
****************************
జీవిత ప్రయాణం అలా సాగిపోతుంటుంది.....
No comments:
Post a Comment