అనకొండ
పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.అనకొండ ప్రపంచంలో అతిపెద్ద విషరహిత సర్పము. ఇవి బాయిడే కుటుంబానికి చెందిన సరీసృపాలు. ఈ సర్పము పేరున పలు ఆంగ్ల సినిమాలు నిర్మించబడినవి. ఇది ప్రపంచములో అతిపెద్దదైన సర్పజాతి. అనకొండ అనే పేరు ఒక వర్గాన్ని మొత్తాన్ని సూచించినా సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే యూనెక్టస్ మ్యూరినస్ అనే జాతినుద్దేశించి వాడుతుంటారు.
అనకొండ క్రింది వాటిల్లో దేన్నైనా సూచించవచ్చు
దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపించే నీటిలో సంచరించే యూనెక్టస్ జాతికిచెందిన ఏ పామునైనా సూచించవచ్చు
కొలంబియాలోని ఆండీస్ లో, వెనెజులా, గయానా, ఈక్వెడార్, పెరూ, బ్రెజిల్, బొలీవియా, ట్రినిడాడ్ ద్వీపము మొదలైన ప్రదేశాల్లో కనిపించే యూనెక్టస్ మ్యూరినస్ (సాధారణ అనకొండ).
తన ఆహారాన్ని నలిపి వేసే ఏ పెద్ద పామునైనా అనకొండ అనవచ్చు
అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతి పెద్దది. 40 అడుగుల పొడవు ఉండి, దాదాపు వెయ్యి పౌన్ల బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు.(18 అడుగులు). మనుషులను, జంతువులను తినే ఆరు రకాల పాములలో ఇది ముఖ్యమైంది. భారతదేశంలో కొండచిలువ వీటిలో ఓ రకం.
No comments:
Post a Comment