Total Pageviews

Monday, September 5, 2011

వేద కాలం


వేద కాలం
చరిత్రకారులు, భాషాశాస్త్రజ్ఞులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన విశేష పరిశోధనల ఆధారంగా ఋగ్వేద భాష, సంస్కృతము, ఋగ్వేద కాలము, ఋగ్వేద స్థానము, ఆర్యులు, ఇండో-ఆర్యులు, ఇండో-యూరోపియనులు మొదలైన విషయాలపై నిర్ధారించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ క్రోడీకరిస్తున్నాము. భవిష్యత్ పరిశోధనల వల్ల వీటిలోకొన్ని మార్పులకు గురికావచ్చు.

ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది.

ఋగ్వేద ఆర్యులకు, అవెస్త ఆర్యులకు భాష, సంస్కృతి, పురాణ గాథలు, అచారములు, కర్మకాండలు మొదలగు వానిలో చాల సామీప్యము గలదు.

సంస్కృతానికి, పెక్కు ఇండో-యూరోపియన్ భాషలకు చాల దగ్గరి సంబంధమున్నది. సారూప్యత ఆచారవ్యవహారములు, గాథలకు కూడ విస్తరిస్తుంది.

ఆర్యులు, ముఖ్యముగా తొలి ఇండో-యూరోపియనులు అశ్వాన్ని మచ్చిక చేసుకున్నారు.

ఋగ్వేద ఆర్యులు, అవెస్త ఆర్యులు తమ జీవన శైలిలో ఒక ముఖ్య భాగముగా సోమ (Ephedra) మొక్కను పరిగణించారు. సోమరసం ఎన్నో విధములుగా ఉపయోగకరము.

తొలి ఇండో-యూరోపియనుల ఉనికి అశ్వముతో, ఇండో-ఇరానియనుల అవాస స్థానము ఎఫిడ్రా (సోమ) మొక్క దొరకు చోటుతో ముడిపడి ఉన్నాయి.

అనగా ఇండో-యూరోపియనులు మధ్య ఆసియా లోని నల్ల సముద్రము, కాస్పియన్ సముద్రము ప్రాంతము నుండి వలస వచ్చారు.

మచ్చికైన గుర్రాలు, చక్రములతో వేగముగా చలించు రథాలు వీరికి తోడ్పడ్డాయి.

వారిలో ఒక ముఖ్య శాఖ ఇండో-ఇరానియనులు. వీరు తొలిసారిగా భారత ఉపఖండములోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెట్టారు.

క్రీ.పూ. 2000నాటికి వీరు మధ్య ఆసియా నుండి సింధూ నదివరకు చేరారు.

క్రీ. పూ. 1700ప్రాంతములో ఇండో-ఇరానియనుల ఒక ప్రముఖ శాఖ ఆఫ్ఘనిస్తాన్ (హెల్మాండ్, అర్ఘందాబ్ నదుల మధ్య ప్రాంతము)లో ఋగ్వేద మంత్రాలను కూర్చారు.

వేదకాలములో హెల్మాండ్ నది పేరు సరస్వతి మరియు హరిరుద్ పేరు సరయు. పేర్లు అన్నియూ ఋగ్వేదము, అవెస్తలలో ఒకటే.

క్రీ.పూ. 1400 నాటికి వేద గణములు తూర్పు దిశగా మధ్య సింధూ మైదానము చేరారు.

క్రీ.పూ. 850 నాటికి పంజాబ్ చేరుకున్నారు.

పిమ్మట ఇనుము వాడకము పెరిగిన నాటికి గంగా మైదానములో జనావాసాలు, జనసంఖ్య పెరిగాయి.

వందల సంవత్సరాల తరబడి జరిగిన వలస క్రమములో ఇండో-ఆర్యులు వారి సాహిత్యం, ధార్మికత, అచారాలు, సంప్రదాయాలతో బాటు ప్రదేశాల పేర్లు, నదుల పేర్లు కొత్త ఆవాసాలకు, కొత్త నదులకు ఆపాదించారు.

పురాతత్వ పరిశోధనల ప్రకారం కూడ భారత దేశ చరిత్ర పశ్చిమం నుండి క్రమంగా తూర్పు దిశగా పయనించి గంగా మైదానములో వ్యాపించి స్థిరపడినది.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF