Total Pageviews

Monday, September 5, 2011

జోక్స్ తెలుగు


చదువు

ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.

"భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.

"నువ్వు చదివావు సరే. మరి ఆపులి పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.

రహస్యం

భజగోవిందం మీద ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆంజనేయులు. "అసలేమిటి మీ ఉద్దేశ్యం? నేను ఒఠ్ఠి అవినీతిపరుడినని, ముండల ముఠాకోరునని, రేసులాడతానని, తాగుతానని, తాగొచ్చి పెళ్లన్ని తంతానని నా మీద ఊరందరికీ చెబుతున్నారట!"

"క్షమించండి సార్.... ఇవన్నీ రహస్యాలని ఇంతవరకూ నాకు తెలియదు" చల్లగా అన్నాడు ఆంజనేయులు.

ఆటగాడు

"మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద player అని పెళ్ళి ఛెశుకున్నా. తీరా చేసుకున్న తరువాత తెలిసింది" విచారంగా అంది సుమలత.
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.

పరాయి స్త్రీ

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్ప చెప్పుకున్నాడు రాజేష్ తన Hi-tech loverతో.
"ఏఁ.. మీ నాన్న నీకు అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.

సామెతలు - ప్రేమ, పెళ్ళి

"ఆలస్యం అమృతం విషమంటే?"
"త్వరగా ప్రేమించు అని".
"మరి.. నిదానమే ప్రధానమంటే?"
"కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో అని".

Parking

"సార్... ఇక్కడ scooter park చేసుకోవచ్చా?" ఒక centerలో policeని అడిగాడు చక్రవర్తి.
"Sorry.... ఇది no parking zone", చెప్పాడు police.
"మరిక్కడ వంద scooterలు ఉన్నాయ్?"
"వారెవరూ మీలా నన్ను అడగలేదు" చెప్పడు police.

తెలివితేటలు

"రాధా రాధా.... మన్ బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు రమేష్.
"అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది రాధ.

Steel సామాను

"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఏదైనా campకి వెళ్తున్నారా?" అడిగింది లత భర్తని.
"Camp నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్.

మాయం

"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
"! ఇప్పుడర్థమైంది. నా తలలోకి వచ్చిన నొప్పి మీదేనా?" తలపట్టుకుని అన్నాడు అర్జున్రావు.

పిసినారితనం

"పిసినిగొట్టుతనానికి హద్దు అదుపు ఉండాలి. మూరెడు మల్లెపూలు తెమ్మంటే పావలా పెట్టి పది విడి పూలు తెస్తారా?" కోపంగా అన్నది రోహిణి.
"సర్లే, ఈపూలను Fridgeలో పెట్టి రోజుకొకటి జడలో గుచ్చుకో" అన్నాడు శాంతారాం.

సిగ్గు లేదా?

Judge : మళ్ళీ మళ్ళీ courtకి రావటానికి నీకు సిగ్గు లేదా?
నేరస్థుడు : మరి మీకు? నేను అప్పుడప్పుడు మాత్రం వస్తున్నాను. మీరు రోజూ వస్తున్నారుగా?

ఎలా వెళ్ళాలి

"సార్.. సార్... Barber shopకి ఎలా వెళ్ళాలి" అని అడిగాడు ఊరికి వచ్చిన్ గిరిబాబు ఒక పెద్దమనిషిని.
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా పెద్దమనిషి.

తెలుసుకుందామని....

రామనాధం, జోగినాధం సువర్చలగారింటికి వెళ్ళారు. గేటు వేసి ఉంది.
"జోగినాధం.... లోపలికెళ్ళి సువర్చల గారున్నారేమో చూడూ" అన్నాడు రామనాధం.
"అమ్మో... వాళ్ళింట్లో పెద్ద కుక్క ఉన్నది. మీద పడి పీకుతుంది." భయంగా అన్నాడు జోగినాధం.
"అది తెలుసుకుందామనే గదా నేను నిను అడుగుతున్నది...." అన్నడు రామనాధం

పుట్టిన రోజు

Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు?
రాము : August 14 teacher.
Teacher : సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!

అమ్మావా??

ఒక రచయిత : నేనీ మధ్య T.V serials కూడా కథలు రాసి అమ్ముతున్నాను, తెలుసా?
శ్రోత : ఇంతవరకు ఏమైనా అమ్మావా?

రచయిత : !....., ఒక వాచీ, ఉంగరం...

మిగిలింది

భార్య : చూశారా! నాఉపవాసాల ఫలితం! నెల బియ్యం ఖర్చు రెండువందల రూపాయలు మిగిలింది.
భర్త : అవుననుకో! కాని.. పళ్ళషాపు వాడికి మాత్రమే ఇంకా వెయ్యి రూపాయలు బాకీ ఇవ్వాల్సి ఉంది.

లోపం

"పెళ్లయి పదేళ్ళయినా పిల్లలులేరని Doctorని కలిశాం" చెప్పింది లక్ష్మి.
"ఏమన్నాడు?" ఉత్సాహంగా అడిగింది మాల.
"నలభై రకాల పరీక్షలు చేయించాడు. ఆర్నెల్ల మందులు వాడించాడు. అయినా ఫలితం కనిపించలేదు"
"ఇంతకూ లోపం ఎవరిలో ఉందని నీ అనుమానం?"
"Doctorలో ఉందనుకుంటున్నాను" నిమ్మళంగా అన్నది లక్ష్మి.

బరువు

"ఏమే దుర్గ... మధ్య బరువు తగ్గాలని నెలరోజుల నుంచీ గుర్రపు స్వారీ చేస్తున్నావటగా? ఏవైనా బరువు తగ్గావా ?" ఆశగా అడిగింది పార్వతి.

"హు.... ఏం తగ్గడమో ఏమో? మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది" నిట్టూరుస్తూ చెప్పింది దుర్గ.

Paper

"ఇదేంట్రా పోయిన వారం weekly చదువుతున్నావు?" అడిగాడు రామేశం.
"ఇదివరుకుట్లా weekly కొనడం మానేశానోయ్. ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు కామేశం.
"మరి weekly ఎవరిది?".
"పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."

ప్రశాంతం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.

"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

కల

"మాంఛి సినిమా తారలు కలలోకి రావాలని దేవుడిని ప్రార్థించి పడుకున్నాను" అన్నాడు పండు.
"మరి వచ్చిందా?" కుతూహలంగా అడిగాడు నరసింహుడు.
"రాక రాక తెల్లవారుఝామున ఒక కల వచ్చింది" చెప్పాడు పండు.
"ఇంకేం. దేవుడు నీ మొర ఆలకించాడన్నమాట" అన్నాడు నరసింహుడు.

"నా బొంద ఆలకించడం. శాంతకుమారి, ఋష్యేంద్రమణి వచ్చారు" అని అన్నాడు పండు.

చెముడు

"Doctor గారూ. నాలుగేళ్ళ నుంచి బ్రహ్మ చెముడు పట్టుకుంది. చెవి పక్క Bomb పేలినా వినపడి చావడం లేదు. ఎలాగైనా తగ్గేలా చెయ్యండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది" బతిమాలాడు పుల్లయ్య.

"అదెంత భాగ్యమోయ్! నా పని అదే కదా. కాకపోతే రెండు వేల రూపాయలు నా Fees అవుతుంది" చెప్పాడు Doctor.

"బాబ్బాబు... చచ్చి మీ కడుపున పుడతాను. పిల్లలు కలవాణ్ణి. అంతిచ్చుకోలేను మూడు వేలల్లో పని అయ్యేట్లు చూడండి." Doctor కాళ్ళు పట్టుకున్నాడు పుల్లయ్య.

అప్పు

"సుబ్రావ్ చచ్చే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంటినిండా బంధువులున్నారు వెయ్యి రూపాయలు urgentగా కావాలి. ఎవర్నడగాలో తోచక ఛస్తున్నాను" అన్నాడు ప్రసాద్.

"హమ్మయ్య బతికించావు. ఇంకా నన్ను అడుగుతావేమోనని హడలి ఛస్తున్నా" పారిపోతూ అన్నాడు రఘు.

మంత్రం

" మధ్య మీ ఆవిడ నువ్వు ఏమన్నాసరే దించిన తల ఎత్తడం లేదా? What a wonder! ఏం మంత్రం వేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.

"ఏం లేదు. నువ్వు తల ఎత్తినప్పుడు అరవై ఏళ్ళ బామ్మలా, తలదించినప్పుడు ఇరవై ఏళ్ళ అప్సరసలా ఉన్నావన్నా. అంతే!" చెప్పాడు రాజు.

Family Planning

"Doctor గారూ ఇప్పటికి అరడజను మంది పిల్లలతో ఛస్తున్నాను. Operation చేయించుకుంటే బాగుంటుందేమో! నేను చేయించుకోవటం మంచిదేనా?" అడిగాడు శ్రీధర్.

"Oh Yes.... ఎందుకైనా మంచిది మీతోపాటు మీ ఆవిడను కూడా చేయించుకోమని చెప్పాండి" పరధ్యానంగా అన్నాడు Doctor.

శపథం

"నా జీవితంలో వెయ్యిమందిని పేకాట, తాగుడు, వ్యభిచారం దురలవాట్లున్నవారిని అలవాట్లు మాన్పిస్తానని భీకర శపథం చేశాను" అన్నాడు బ్రాందిమూర్తి.

"Very good.... చాలా మంచి పని. మరి ఎవరిచేతైనా అలామాన్పించావా?" అడిగాడు కృష్ణమూర్తి.

"ఇప్పటికి 999 మంది చేత అలవాటు మాన్పించాను"

"అద్భుతం! ఇంకొక్కడేగా మిగిలింది! అది కూడా పూర్తి చేయకపోయావా?"

"అదే చూస్తున్నా. నేను కూడా మానేద్దామా, వద్దా అని" గొణిగాడు బ్రాందిమూర్తి.

bus ఎక్కడికి వెళ్తుంది

" బస్సు ఎక్కడికి వెళ్తుంది? " అని conductor ని అడిగాడు ఒక ప్రయాణికుడు.
"గుంటూరు వెళ్తుంది" అని బదులిచ్చాడు conductor.
"మరి board మీద విజయవాడ అని రాసి ఉంది కదా?" అని ప్రశ్నించాడు ప్రయాణికుడు.
"నువ్వు బస్సెక్కి వెళ్తావా? లేక బోర్డ్ ఎక్కి వెళ్తావా?" అని కసురుకున్నాడు conductor.

అచ్చొచ్చేది

"మా వాడికి అన్ని subjects లోనూ గుండు సున్నాలొస్తున్నాయి. వాడెలా బాగుపడతాడో అర్థం కావడం లేదు" విచారంగా అన్నాడు నారాయణ.

"దానికంత విచారం దేనికిరా? కోడిగుడ్ల వ్యాపారంలోకి దించు రాణిస్తాడు" చెప్పాడు సీతాపత.

మళ్ళీ

"ఏంటీ? నాకు మళ్ళీ operation చెయ్యాలా? అదేం? నిన్ననే చేసిన operation success అన్నారుగా?" భయంగా అన్నాడు Patient.
"భయపడకోయ్... operation success అనేదాంట్లో అణుమాత్రం సందేహం లేదు. కానీ నిన్న operation చేస్తున్నప్పుడు మా doctor గారి రత్నాల ఉంగరం మీ పొట్ట్లో జారి పదిపోయిందట" చెప్పాడు compounder.

అవకాశం

వెంకట్రావు పెళ్ళి చూపులకు వెళ్ళాడు. సుందరి సిగ్గు పడుతూ చాప మీద కూర్చుంది. పిల్ల నచ్చింది అన్నాడు వెంకట్రావు.

"చాలా సంతోషం బాబూ. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు. పెళ్ళైన తరువాత నీకు అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు సుందరి తండ్రి రాజనాల.

అన్యాయం

"ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు ఆరేళ్ళ ప్రమోద్.
"అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు తండ్రి.
"లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుకాదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు ప్రమోద్.

దిష్టి

"కాంపౌండరు గారూ..... నిన్నాటినుండి తలంతా దిమ్ముగా ఉంది. తలపోటుగా ఉంది. డాక్టరు గారు లేరా?" మూలుగుతూ అడిగింది కన్నాంబ.
"మీరు కూర్చోండి. డాక్టరు గారు లోపల ఉన్నారు" అన్నాడు కాంపౌండరు.
"త్వరగా పిలవండి ప్లీజ్"
"వస్తారుండమ్మా డాక్టరుగారికి రాత్రి నుంచి తలపోటుగా వుంటే వాళ్ళమ్మ చేత దిష్టి తీయించుకుంటున్నారు" చెప్పాడు కాంపౌండరు.

విలువ

"రెండు ప్లేట్లు వేడి వేడి గారెలు పట్రావోయ్" ఆర్డరేశాడు బ్రహ్మానందం.
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"
"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా చెమట విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF