శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం దక్షిణ అమెరికా దాదాపు 135 మిలియన్ సంవత్సరాల క్రితం (13.5 కోట్లు) మహాఖండంగా పేరొందిన గోండ్వానా ల్యాండ్ పశ్చిమ భాగం నుంచి విడిపోయి, ప్రత్యేక ఖండంగా ఏర్పడింది. కరేబియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొన్న కారణంగా దక్షిణ అమెరికా సరిహద్దు పొడవునా వరుసగా భూకంపాలు చెలరేగడంతో పలు ద్వీపాలు ఏర్పడ్డాయి.
ఉత్తర, దక్షిణ అమెరికా భూభాగాలనుంచి కొట్టుకొచ్చిన పదార్ధాలు మధ్య అమెరికాలోని ఖాళీ ప్రాంతాలను పూరించాయి. పైగా వరుసగా అగ్నిపర్వతాలు, భూకంపాల కారణంగా కొత్త భూభాగం రూపొందుతూ వచ్చింది. 30 లక్షల సంవత్సరాల నాటికి ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య పనామా అనుసంధానంగా ఏర్పడింది. దీంతో అమెరికా ఏకైక ఖండంగా రూపొందింది.
అమెరికా నామకరణం
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండీ అమల్లోకి వచ్చింది.
దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. 16వ శతాబ్దములో ఆంగ్లేయులు, ఫ్రెంచి మరియు స్పానిష్ ప్రజల ఆధ్వర్యాన అమెరికాలో ఐరోపా ప్రజల వలసలు మొదలయ్యాయి.
1776, జూలై 4న తూర్పు తీరము వెంట ఉన్న 13 బ్రిటిషు కాలనీలు బ్రిటిషు ప్రభుత్వ పాలనను నిరసించి స్వాతంత్ర్యము ప్రకటించుకొని యుద్ధం ప్రారంభించాయి. 1783లో బ్రిటిషు ప్రభుత్వము అమెరికాను స్వతంత్ర దేశముగా గుర్తించడంతో యుద్ధం ముగిసింది. 1776 జూలై 4 ను సాధారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన రోజుగా గుర్తిస్తారు.
(ఆగస్టు 26 కొలంబస్ జన్మదినం. ఇండియా అని పొరపడి అతడు కనిపెట్టిన అమెరికా చరిత్ర మూలాన్ని కాస్త తడుముదామనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని పోస్ట్ చేయడమైంది. అమెరికా పూర్వ చరిత్ర గురించి తెలుగు అకాడమీ 20 ఏళ్ల క్రితం అచ్చేసిన పుస్తకంలో చదివినట్లు జ్ఞాపకం. మళ్లీ ఇప్పుడు ఇలా మననం
No comments:
Post a Comment