పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వాతావరణం కలుషితమవుతోంది… ఓజోన్ పొర క్షీణిస్తోంది… భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి అని గగ్గోలు పెట్టిన ప్రపంచం ఇప్పుడు పర్యా వరణాన్ని రక్షించే పనిలో పడింది.
పరిశ్రమల కాలుష్యం...
నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడ ఎంతో అవసరం. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలేనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదులుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుం టున్నాయి. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడ పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనాలను కలియ బెట్టినప్పుడు విష వాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. వ్యర్థాల శుద్ధికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఉన్నప్పటికి చాలా పరిశ్రమల్లో ఇప్పటికి వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయాలు లేవు. దీనివల్ల పర్యావరణానికి పెద్ద మొత్తంలో హాని జరుగుతోంది.
పాలిథిన్ కాలుష్యం.
మన జీవన శైలి మీద, పర్యావరణం మీద ప్లాస్టిక్ చూపుతున్న ప్రభావం అం దరికి తెలిసిందే. ఇటీవల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఎక్కువైపోయింది. ఇవి పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్స హించాలి. క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునే వారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ను వీలైనంత తక్కువగా ఉపయోగించుకోవాలి. అయితే ఇంత వరకు మనం సృష్టించిన ప్లాస్టిక్ చెత్త శిథిలమవుతూ వాతావర ణంలోకి హరిత వాయువులను విడుదల చేస్తూనే ఉంది. ఈ చెత్తను పర్యావరణానికి హాని కలి గించకుండా సద్వినియోగం చేయాలని ఎంతోమంది శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

నీటి కాలుష్యం…
పర్యావరణ కాలుష్యంలో నీటి కా లుష్యం ప్రధానమైంది. మనం బ్రత కడానికి నీరు అవసరం. భూమిపై మూడు వంతులు నీరు, ఒక వంతు నీరు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కాగా భూమిపై మూడు వంతులు నీళ్లు ఉనప్పటికి మనకు ఉపయోగపడేది మాత్రం 1% మాత్రమే…! చెరువులు, నదులు, భూ గర్భంలో ఉన్న నీటిని మనం తాగడానికి వాడుతాము. ఈ ఒక్క శాతం నీటితోనే మనం భూమిపై ఉన్న మూడు వంతుల నీటిని కలుషితం చేస్తున్నాం. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడ మురికిమయం చేస్తున్నాం. భూమిపై ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరై తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. కాగా మనం వాడిన నీళ్లు మురికి నీళ్లుగా మారి మళ్లీ ఆవరణ వ్యవస్థలోకే చేరుతున్నాయి. వాటిలో ఉండే రసాయనాలు చేపల్లోకి చేరి, అలాగే ఆ చేపలను తినే అన్ని రకాల జం తువుల్లోకి చేరి ఒక జీవి నుండి మరో జీవికి కాలుష్యం విస్తరించి మొత్తం ఆవరణ వ్యవస్థకే నష్టం కలిగిస్తోంది.

వాయు కాలుష్యం…
దీంతోపాటు పర్యావరణ కాలుష్యంలో గాలి కాలుష్యం ఒకటి. గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయ పొలాల్లో పంటల సాగుకై రసాయనిక ఎరువులు, క్రిమి సం హారక మందుల వాడకం వలన వాయుకాలుష్యం ఏర్పడుతుండగా, పట్టణాల్లో, నగరాల్లో ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల ఈ సమస్య తీవ్రంగా పరిణమిస్తోంది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు సొంత వాహనాన్ని కొనుగోలు చేయడం ఫ్యా షన్గా మారింది. అందులో భాగంగా మనం కొనుగోలు చేసిన కార్లు, స్కూటర్లు తదితర వాహనాలు రోడ్ల మీదకు కాలుష్యాన్ని మోసుకోస్తు న్నాయి. కాగా విమానాలకు వాడే ఇంధనం అధిక కాలుష్యాన్ని పుట్టిస్తోంది. ద్రవ్య చలామణి పెరగడం, విమాన చార్జీలు తగ్గ డం, ప్రైవేట్ విమానాల సంఖ్య పెరగడం మూలంగా ఎయిర్ ట్రాఫిక్ పెరిగి వాయు కాలుష్యం మరింత ఎక్కువైపోతుంది. వాహనాల, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయి. దీంతో నేలపైన, నీటిలో ఉన్న అన్ని జీవరాశులు ఈ కాలుష్యం బారిన పడుతున్నాయి.

ధ్వని కాలుష్యం…
పర్యావరణ కాలుష్యంలో శబ్ద కాలుష్యం మరొకటి. ఆధునిక కాలంలో శబ్ద కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. వినిి డి పరిమితికి మించి వచ్చే ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యం క్రిందకే వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని త్రైషోల్డ్ లిమిట్‌తో కొలుస్తారు. కొన్ని శబ్దాలు త్రైషోల్డ్ పరిధిలో ఉన్నప్పటికి భరించరానివిగా ఉంటాయి. ఇవి మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ శబ్దం పెరుగుతూ ఉంది. వాహ నాల హారన్ల మోతతో మనిషి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. శబ్దకాలుష్యం మన శరీరంపై, మెదడుపై ఎంతో ప్రభావం చూపే అవకాశాలు న్నాయని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. మానవుడు రణగోణ ధ్వనుల మధ్య ఎక్కువ కాలం ఉన్నట్లైతే అతని ప్రవర్తనలో కూడ మార్పు వచ్చే అవకాశాలు న్నాయని, అందులో భాగంగా కోపం, చికాకు తదితరాలు శబ్ద కాలుష్యం వల్ల వస్తాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. అలాగే దీనివలన వినికిడి లోపాలు, జీర్ణ శక్తి, జీవక్రియ, రక్త ప్రసరణల్లో కూడ మార్పులు కలుగుతాయి.

గ్రీన్హౌస్ ఎఫెక్ట్…
చలి ప్రదేశాల్లో కూరగాయలను పండించడానికి అద్దాలతో మూసివేసిన షెడ్లను నిర్మిస్తారు. ఈ అద్దాల గుండా లోనికి ప్రవేశించిన సూర్యరశ్మిలో కొంతభాగం పరావర్తనం చెంది బయటకు పోతుంది. కానీ మరికొంత భాగం లోపలే ఉండి పోయి వెచ్చదనం వ్యాపిస్తుంది. ఈ అద్దాల నిర్మాణమే గ్రీన్హౌస్. అలాగు ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు చాలా ఉన్నా వాటి మీద జీవరాశి లేదు. భూమి మీద జీవరాశి మనుగడ సాగించడానికి దాని మీద ఏర్పడిన వాతవరణమే కారణం. నిశితంగా భూగోళాన్ని పరిశీలిస్తే కొన్ని రకాల వాయువులతో కూడిన ఒక పలుచటి దుప్పటి కప్పుకున్నట్లు ఉంటుంది.

ఈ వాయు పొరే గ్రీన్హౌస్లో అద్దాల మాదిరిగా పని చేస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు వాతవరణ వేడిమికి కారణమవుతాయి. భూమిని కప్పి ఉన్న ఈ వాయుకణాలు సూర్యుని నుండి వెలువడే కొన్ని రకాల శక్తి కిరణాలను అడ్డుకుని అన్ని వైపుల వెదజల్లుతాయి. ఈ చర్య గ్రీన్హౌస్లోని అద్దాల మాదిరిగా పని చేస్తుంది కనుక దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ లేకుంటే భూగోళం అతి శీతలమైన మంచు ముద్దలా ఉండేది. ఈ ఎఫెక్ట్ జీవజాలానికి చాలా అవసరం. దీని మూలంగానే మనం సుఖంగా ఉండగలుగుతున్నాము. అలాగే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ శృతిమించితే మానవాళిని అంతం చేసే ప్రమాదం కూడ ఉంది.
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ …
గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వల్ల భూతాపం కూడ పెరుగుతూ భూ వాతవరణానికి ముప్పు తెచ్చిపెడుతుంది. దీనివలన చాలా సున్నితమైన భూ వాతవరణంలో పెద్ద మా ర్పులు సంభవిస్తున్నట్లు శాస్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు భూమి పొరల్లోని శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను రాను రాను మరింత సామర్థ్యంతో, మరింత వేగంగా తోడేసి ఫ్యాక్టరీల్లోనూ, వాహనాల్లోనూ మండింపజేస్తున్నాయి. అడవులను నరికివేస్తూ జీవ వైవిద్యాన్ని నాశనం చేస్తున్నాయి. నేలను తలక్రిందులు చేసి ఖనిజాలను విచక్షణా రహితంగా తోడే స్తున్నాయి.

ఈ చర్యల వలన భూగోళం ధృవాల వద్ద, మంచుప్రాంతాల్లో ని మంచు కరిగిపోయి జలరాసిగా మారిపోతుం ది. దీంతో సముద్రాల నీటి మట్టం పెరగడంతో పా టు తీర ప్రాంతాలు నీటి మునిగిపోయే ప్రమాదాలున్నాయి. అలాగే ఒక ప్రాం తంలో అధిక వర్షాలు, ఉధృతమైన వరదలు సంభవిస్తే మరికొన్ని ప్రాంతాల్లో అస్సలు వర్షాలు లేక కరువు కాటకాలతో జీవులు అలమటించే ప్రమాదం కూడ ఉంది.జలవనరులు నాశనమై మంచినీటికి కటకట ఏర్పడుతుంది. పంటల సీజన్లలో మార్పులొస్తాయి. భూమి వేడి పెరుగుతున్న కొద్ది వరదలూ, తుఫానులు, దుర్భిక్షాల తీవ్రతా, సంభావ్యతా బాగా పెరుగుతాయి. వీటి పర్య వసానాలు మానవాళిపై చాలా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భూతాపం పెరుగకుండా అవసరమైన చర్యలను వేగవంతంగా చేపట్టకపోతే మనిషికి వినాశం తప్పదు.
క్షీణిస్తున్న ఓజోన్ పొర…
ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న వాతావరణ కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంది. ఇటీవల ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిక ప్రకటన ధరిత్రిని చట్టుముడుతున్న ప్రమాద సంకేతాలకు అద్దం పడుతుంది. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్ పొర ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక శాతంలో క్షీణించినట్టు శాస్తజ్ఞ్రుల అధ్యయనంలో వెల్లడైంది. ఓజోన్ పొరను కరిగించే వ్యర్థాలు వాతావరణంలో అధిక స్థాయిలో ఉండడమే దీనికి కారణం. గతంలో 30 శాతంగా ఉన్న క్షీణత ప్రస్తుతం 40 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇది మరింత ఉదృతంగా మారే ప్రమాదం ఉందని, దీంతో మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవ స్థ తీవ్రంగా ప్రభావితమై క్యాన్సర్, కంటి జబ్బులు పెరిగే అవకాశాలున్నాయి.

No comments:
Post a Comment