అంతరిక్షంలో తొలి మానవుడు
యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్ లేదా యూరీ గగారిన్ ( జననం మార్చి 9 1934 - మరణం మార్చి 27 1968). ఇతడు సోవియట్ వ్యోమగామి, రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12 న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర పుటలకెక్కాడు, అలాగే మొదటి సోవియట్ కూడానూ. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. తొలిసారిగా అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు, ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, బహుమానాలు ఇచ్చి, ఇతడిని గౌరవించాయి.అంతరిక్ష యాత్ర
గగారిన్ ఏప్రిల్ 12 1961 న, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా నమోదయ్యాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టోక్ 3KA-2 (వోస్టోక్ 1). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్' తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం 'ద మదర్ ల్యాండ్ హియర్స్, ద మదర్ ల్యాండ్ నోస్' ను అంతరిక్షంలో పాడాడు.
నేను ఏ దేవుడినీ ఇక్కడ చూడడం లేదు
ఆ కాలంలో మీడియాలో గగారిన్ చేసిన వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. 'నేను ఏ దేవుడినీ ఇక్కడ చూడడం లేదు' అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని ఏమీ లేవు.
మరణం
గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి స్టార్ సిటీలో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్గా తిరిగీ అర్హత పొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968న చకలోవ్స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా, మిగ్ -15 UTI విమానం కిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి ఇతను మరియు ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మరణించారు. వీరిరువురినీ రెడ్ స్క్వేర్లోని క్రెమ్లిన్ గోడలు ప్రాంతంలో ఖననం చేసారు.
No comments:
Post a Comment