చేప గుడ్లు ఎలా పెడుతుంది?
చేపల విశిష్టమైన పద్ధతి ఓవిపారిటీ. దీనిలో ఆడ చేప పరిపక్వం చెందని గుడ్లను నీటిలో ఉంచుతుంది. సామాన్యంగా ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో అంటే కొన్ని మిలియన్లలో ఉంటాయి. ఇవి నీటిలో స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాయి. మగ చేపలు వీటి మీద వీర్య కణాల్ని విడుస్తాయి.
ఫలదీకరణం జరిగిన తర్వాత జన్మించే పిల్ల చేపలు వెంటనే ఈదు కుంటూ పోతాయి. వీనిలో చాలా వరకు పెద్ద చేపలకు ఆహారంగా చనిపోతాయి. చేపలకు తల్లి చేప గాని, తండ్రి చేప గాని సంరక్షణ బాధ్యత స్వీకరించవు. కొన్ని చేపలు, ముఖ్యంగా రే చేపలు మరియు సొర చేపలు ఓవీవివిపారిటీ పద్ధతి పాటిస్తాయి. దీనిలో గుడ్లు ఫలదీకరణం శరీరం లోపలే జరుగుతుంది.
ఢింబకాలు గుడ్డులోని సొనను తింటాయి; తల్లి నుండి ఆహారాన్ని గ్రహించవు. తల్లి చేప పిల్ల చేపలకు జన్మనిస్తుంది. కొన్ని సార్లు అభివృద్ధి చెందిన పిల్ల చేప చిన్నవైన ఇతర చేపలను తినేస్తాయి. దీనిని అంతర గర్భశయ కానబాలిజం అంటారు.
మరికొన్ని అరుదైన వివిపారస్ సొర చేపలలో తల్లి చేప పూర్తిగా కడుపులో అభివృద్ధి చెందిన తరువాత చేప పిల్లలను కంటుంది. ఫలదీకరణం తర్వాత పిండాన్ని కడుపులో పోషిస్తుంది.
సరీసృపాల గుడ్లు సాధారణంగా మెత్తగా రబ్బరులాగా ఉండి తెల్లని రంగులో ఉంటాయి. ఇవి భూమిలో తవ్వి అక్కడ గుడ్లు పెడతాయి. పిండం యొక్క లింగం బాహ్య ఉష్ణోగ్రతపై ఆధారపడు వుంటుంది. చల్లగా ఉంటే మగ పిల్లలు తయారౌతాయి
No comments:
Post a Comment