Total Pageviews

Monday, September 5, 2011

జోక్స్ తెలుగు


రైలు ప్రయణం - పెళ్ళికి ముందు, తరువాత

పెళ్ళికి ముందు

రాము, సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది. ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం. వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విశాఖపట్టణంలో). ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు.



సమయం : 22:00 hrs

సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు?

రాము : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.

రాము : సరే. నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.

సీత : సరే



ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు (brittania little hearts) biscuit packet కూడా తీసుకు వచ్చాడు.



సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా?

రాము : మ్.. అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.

సీత : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను. ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.

రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.



రాము, సీత రైలు ఎక్కుతారు.



సీత : side upper side lower book చేసారా?

రాము : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.

అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. మా నిద్రను disturb చేస్తున్నారు".
సరే అని రాము, సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి, మాట్లాడుకుని వచ్చి తమ తమ berth లో పడుకున్నారు.

పెళ్ళైన తరువాత
పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము, సీత ప్రయాణమయ్యారు. ఇద్దరూ train ఎక్కారు.
సీత : బెర్త్??
రాము : రెండు upper berths book చేసాను (మనసులో వెధవ నస ఉండదు)
సీత : హమ్....
రాము : సరే water bottle ఇవ్వు.
సీత : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.
రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.
సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, 5 నిమిషాలు కూడా ఉండదు.
రాము : (ఛీ ఎధవ బతుకు)
రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు. ( సారి నీళ్ళు మాత్రమే. చిన్ని చిన్ని గుండెలు లేవు)
train time అయ్యింది , బయలు దేరింది.
సీత (ఆవిలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.
రాము : సరే పడుకో. (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)
TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు. పక్కనే side upper ,side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు.
జంట సరేనని, మెల్లగా train తలుపు వైపు వెళ్ళి .........
****************************

coffee

"ఏంటీ? మామూలు కాఫీ రెండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా? ఏంటో స్పెషల్?" సర్వర్ని అడిగాడు సుందరం.

"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మెదటిసారి కఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది" చెప్పాడు సర్వర్.

పేరు

Interview జరుగుతున్నది.
"మీ పేరు?" అడిగాడు అధికారి.
"శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీనివాస్ సర్" చెప్పాడు అభ్యర్థి.
"ఏంటి... అన్ని శ్రీ లెందుకు మీకు?"
"............... నాకు నత్తి సార్"

ఇంటివాడు

చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు.

"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF